Telugu Global
Cinema & Entertainment

మరో సినిమా ప్రారంభించిన నిఖిల్

మొన్ననే తిరుపతిలో కార్తికేయ-2 సినిమాను ప్రారంభించాడు నిఖిల్. ఈరోజు మరో కొత్త సినిమాను ప్రారంభించాడు. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై నిఖిల్ హీరోగా సూర్య ప్రతాప్ దర్శకత్వంలో కొద్దిసేపటి కిందట కొత్త సినిమా లాంఛ్ అయింది. ఈ మూవీకి చాలా ప్రత్యేకతలున్నాయి. సుకుమార్ ఈ సినిమాకు కథ అందించాడు. స్క్రీన్ ప్లే కూడా అతడే సమకూర్చి పెట్టాడు. సూర్యప్రతాప్ దర్శకత్వం మాత్రం వహిస్తాడు. అంతేకాదు.. ఈ సినిమాకు సుకుమార్ సహ-నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నాడు. ఎప్పట్లానే అల్లు అరవింద్ సమర్పకుడిగా […]

మరో సినిమా ప్రారంభించిన నిఖిల్
X

మొన్ననే తిరుపతిలో కార్తికేయ-2 సినిమాను ప్రారంభించాడు నిఖిల్. ఈరోజు మరో కొత్త సినిమాను ప్రారంభించాడు. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై నిఖిల్ హీరోగా సూర్య ప్రతాప్ దర్శకత్వంలో కొద్దిసేపటి కిందట కొత్త సినిమా లాంఛ్ అయింది. ఈ మూవీకి చాలా ప్రత్యేకతలున్నాయి.

సుకుమార్ ఈ సినిమాకు కథ అందించాడు. స్క్రీన్ ప్లే కూడా అతడే సమకూర్చి పెట్టాడు. సూర్యప్రతాప్ దర్శకత్వం మాత్రం వహిస్తాడు. అంతేకాదు.. ఈ సినిమాకు సుకుమార్ సహ-నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నాడు. ఎప్పట్లానే అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తారు.

ఈ సినిమాకు “18 pages” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోజు టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు ఇంకా హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదు. అటు కార్తికేయ-2, ఇటు 18 pages సినిమాలకు సైమల్టేనియస్ గా కాల్షీట్లు కేటాయించాడు నిఖిల్. ఈ రెండు సినిమాలు తన కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోతాయని భావిస్తున్నాడు.

First Published:  5 March 2020 1:00 AM GMT
Next Story