Telugu Global
Cinema & Entertainment

ఇంత రిస్క్ అవసరమా ప్రభాస్

యూరోప్ ను కరోనా వణికిస్తోంది. స్పెయిన్, ఇటలీతో పాటు మరెన్నో దేశాలు ఈ వైరస్ తో ఇబ్బంది పడుతున్నాయి. టూరిస్టులంతా విదేశీ పర్యటనలు రద్దుచేసుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో యూరోప్ వెళ్లాడు ప్రభాస్. అవును.. తన కొత్త సినిమా షూటింగ్ కోసం ప్రభాస్ యూరోప్ వెళ్లాడు. అతడు ఏ దేశం వెళ్లాడనేది ప్రస్తుతానికి తెలియకపోయినా, కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న యూరోప్ కు ప్రభాస్ వెళ్లడం మాత్రం ఎవరికీ నచ్చలేదు. నిన్న ఎయిర్ పోర్ట్ లో ముఖానికి […]

ఇంత రిస్క్ అవసరమా ప్రభాస్
X

యూరోప్ ను కరోనా వణికిస్తోంది. స్పెయిన్, ఇటలీతో పాటు మరెన్నో దేశాలు ఈ వైరస్ తో ఇబ్బంది పడుతున్నాయి. టూరిస్టులంతా విదేశీ పర్యటనలు రద్దుచేసుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో యూరోప్ వెళ్లాడు ప్రభాస్. అవును.. తన కొత్త సినిమా షూటింగ్ కోసం ప్రభాస్ యూరోప్ వెళ్లాడు. అతడు ఏ దేశం వెళ్లాడనేది ప్రస్తుతానికి తెలియకపోయినా, కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న యూరోప్ కు ప్రభాస్ వెళ్లడం మాత్రం ఎవరికీ నచ్చలేదు.

నిన్న ఎయిర్ పోర్ట్ లో ముఖానికి మాస్క్ తో కనిపించాడు ప్రభాస్. అతడు యూరోప్ వెళ్లాడనేది ఫిక్స్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ఓ సినిమా చాన్నాళ్లుగా డిలే అవుతూ వస్తోంది. ఆ మూవీకి సంబంధించి ఓ షెడ్యూల్ ను యూరోప్ లో ఫిక్స్ చేశారు. దాదాపు 3 నెలల కిందటే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అంతా ఓకే అనుకున్న టైమ్ లో కరోనా ప్రబలింది.

తన కళ్లముందు ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభాస్ మాత్రం వెనక్కు తగ్గలేదు. యూరోప్ షెడ్యూల్ కు రెడీ అయిపోయాడు. ప్రభాస్ తో పాటు మొత్తంగా 30 మంది యూనిట్ సభ్యులు యూరోప్ వెళ్లారు. వీళ్లంతా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే కరోనా సోకడం ఖాయం. సినిమా ఆలస్యం కాకూడదని ప్రభాస్ చేసిన ఈ రిస్క్ ను కొంతమంది అభినందిస్తుంటే.. అతడి డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా చేసుకోవచ్చు, ఇంత రిస్క్ అవసరమా ప్రభాస్ అని ప్రశ్నిస్తున్నారు.

First Published:  4 March 2020 10:30 PM GMT
Next Story