Telugu Global
NEWS

రంజీట్రోఫీ పైనల్స్ వేదిక రాజ్ కోట

సౌరాష్ట్ర్రకు బెంగాల్ సవాల్ రంజీట్రోఫీ 2019-2020 సీజన్ టైటి్ల సమరానికి మాజీ చాంపియన్లు బెంగాల్, సౌరాష్ట్ర్ర జట్లు అర్హత సంపాదించాయి. రాజ్ కోటలోని సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా మార్చి 9 నుంచి ఐదురోజులపాటు జరిగే టైటిల్ సమరంలో ఈ రెండుజట్లూ తలపడనున్నాయి. సౌరాష్ట్ర్ర బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్… ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ నాయకత్వంలోని సౌరాష్ట్ర్ర జట్టు రంజీట్రోఫీ ఫైనల్స్ కు వరుసగా రెండోసారి అర్హత సంపాదించింది. గత సీజన్ ఫైనల్లో విదర్భ చేతిలో […]

రంజీట్రోఫీ పైనల్స్ వేదిక రాజ్ కోట
X
  • సౌరాష్ట్ర్రకు బెంగాల్ సవాల్

రంజీట్రోఫీ 2019-2020 సీజన్ టైటి్ల సమరానికి మాజీ చాంపియన్లు బెంగాల్, సౌరాష్ట్ర్ర జట్లు అర్హత సంపాదించాయి. రాజ్ కోటలోని సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా మార్చి 9 నుంచి ఐదురోజులపాటు జరిగే టైటిల్ సమరంలో ఈ రెండుజట్లూ తలపడనున్నాయి.

సౌరాష్ట్ర్ర బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్…

ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ నాయకత్వంలోని సౌరాష్ట్ర్ర జట్టు రంజీట్రోఫీ ఫైనల్స్ కు వరుసగా రెండోసారి అర్హత సంపాదించింది. గత సీజన్ ఫైనల్లో విదర్భ చేతిలో పరాజయం పొందిన సౌరాష్ట్ర్ర ఈసారి హోంగ్రౌండ్ వేదికగా తన అదృష్టం పరీక్షించుకోనుంది.
గుజరాత్ తో ముగిసిన రెండో సెమీఫైనల్లో సౌరాష్ట్ర్ర జట్టు 92 పరుగుల విజయంతో ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది.

327 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన గుజరాత్ …సౌరాష్ట్ర్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ పేస్ కు నిలబడలేకపోయింది.

గుజరాత్ కెప్టెన్ పార్థివ్ పటేల్ 93, మిడిలార్డర్ ఆటగాడు చిరాగ్ గాంధీ 96 పరుగుల స్కోర్లతో తుదివరకూ పోరాడినా …ప్రయోజనం లేకపోయింది. సౌరాష్ట్ర్ర కెప్టెన్ జయదేవ్ 7 వికెట్లు పడగొట్టి మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.

బెంగాల్ రంజీ కలలు…

2006-2007 సీజన్ తర్వాత తొలిసారిగా రంజీట్రోఫీ పైనల్స్ చేరిన మాజీచాంపియన్ బెంగాల్ మాత్రం టైటిల్ మరోసారి తమదేనన్న ధీమాతో ఉంది.

తొలిసెమీపైనల్లో పవర్ ఫుల్ కర్నాటకను చిత్తు చేసిన ఆత్మవిశ్వాసంతో టైటిల్ వేటకు దిగుతోంది.
బెంగాల్ తరపున మహ్మద్ షమీ, వృద్ధిమాన్ సాహా లాంటి అంతర్జాతీయ క్రికెటర్లు బరిలోకి దిగుతుంటే…సౌరాష్ట్ర్ర బ్యాటింగ్ కు భారత క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారా వెన్నెముక కానున్నాడు.

First Published:  5 March 2020 12:28 AM GMT
Next Story