Telugu Global
National

ఐటీ ఉచ్చులో అహ్మద్ పటేల్... బాబులో ఆందోళన?

తీగలాగితే కొండ కదులుతోందా? కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కు తాజాగా ఐటీ నోటీసులు రెండోసారి జారీ కావడం… ఈసారి హాజరు కావాలని కోరడం టీడీపీ అధినేత చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. బీజేపీని గద్దెదింపడమే ధ్యేయంగా సార్వత్రిక ఎన్నికల వేళ తన బద్ధశత్రువైన కాంగ్రెస్ తో జట్టుకట్టాడు చంద్రబాబు. అంతేకాదు.. అంతకుముందు జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ తో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలకు కొన్ని కోట్ల రూపాయలను కాంగ్రెస్ […]

ఐటీ ఉచ్చులో అహ్మద్ పటేల్... బాబులో ఆందోళన?
X

తీగలాగితే కొండ కదులుతోందా? కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కు తాజాగా ఐటీ నోటీసులు రెండోసారి జారీ కావడం… ఈసారి హాజరు కావాలని కోరడం టీడీపీ అధినేత చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుందా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

బీజేపీని గద్దెదింపడమే ధ్యేయంగా సార్వత్రిక ఎన్నికల వేళ తన బద్ధశత్రువైన కాంగ్రెస్ తో జట్టుకట్టాడు చంద్రబాబు. అంతేకాదు.. అంతకుముందు జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ తో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలకు కొన్ని కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీ కోసం అహ్మద్ పటేల్ కి ఏపీ మాజీ సీఎం చంద్ర బాబు అందజేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

ఎన్నికల్లో డబ్బులు చేతులు మారాయని ఐటీ శాఖ గుర్తించి.. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ప్రమేయాన్ని కనిపెట్టి… ఫిబ్రవరి 14వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది.

అయితే అహ్మద్ పటేల్ మాత్రం తనకు ఆరోగ్యం బాగాలేదని, అదీగాక పార్లమెంటు వ్యవహారాల్లో బిజీగా ఉన్నానని గడువు కోరారు. తాజాగా మరోసారి ఐటీశాఖ నోటీసులు పంపింది.

ముంబైకి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి ఒక ప్రముఖ వ్యక్తి లంచంగా 150 కోట్లు తీసుకున్నాడని ఐటీ శాఖ గుర్తించిందని తేలింది. అమరావతి నిర్మాణాల కోసం ఆ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చిన వ్యక్తి… అందులో తొలి దశలో 150 కోట్లు లంచంగా తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. 150 కోట్ల రూపాయలు తీసుకున్న ఆంధ్రుడు అంటూ గత ఏడాది నవంబర్ 11వ తేదీన ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం ద్వారా ఐటీ శాఖ ప్రకటన విడుదల చేయడంతో… ఆ వ్యక్తి చంద్రబాబే అన్న ప్రచారం సాగింది.

ఇప్పుడు చంద్రబాబు మెడకు ఇది కత్తిలా వేలాడుతోంది. అహ్మద్ పటేల్ నోరు విప్పినా.. 150 కోట్ల ముడుపుల కేసు తేలినా చంద్రబాబు అరెస్ట్ కావడం.. జైలుకెళ్లడం ఖాయమని తెలుగుతమ్ముళ్లు హడలిపోతున్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న టీడీపీ అధినేత పునాదులు కదులుతున్నాయన్న చర్చ సాగుతోంది.

First Published:  6 March 2020 3:24 AM GMT
Next Story