Telugu Global
NEWS

మహిళా ప్రపంచకప్ ఫైనల్స్ లో భారత్

వానదెబ్బతో ఇంగ్లండ్ తో సెమీస్ రద్దు 2020 మహిళా టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు నాలుగో ర్యాంకర్ భారత్ తొలిసారిగా చేరుకొంది. టైటిల్ సమరంలో నాలుగుసార్లు విజేత ఆస్ట్ర్రేలియాతో భారత్ తలపడనుంది. సిడ్నీ వేదికగా ఇంగ్లండ్ తో జరగాల్సిన తొలిసెమీఫైనల్స్ కుండపోత వర్షం కారణంగా రద్దు కావడంతో..మెరుగైన రన్ రేట్ తో పాటు లీగ్ దశలో అత్యధిక విజయాలు సాధించిన భారత్ ను ఫైనల్స్ చేరినట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది. గ్రూప్ -ఏ లీగ్ లో భారత్ ఆడిన నాలుగుకు […]

మహిళా ప్రపంచకప్ ఫైనల్స్ లో భారత్
X
  • వానదెబ్బతో ఇంగ్లండ్ తో సెమీస్ రద్దు

2020 మహిళా టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు నాలుగో ర్యాంకర్ భారత్ తొలిసారిగా చేరుకొంది. టైటిల్ సమరంలో నాలుగుసార్లు విజేత ఆస్ట్ర్రేలియాతో భారత్ తలపడనుంది.

సిడ్నీ వేదికగా ఇంగ్లండ్ తో జరగాల్సిన తొలిసెమీఫైనల్స్ కుండపోత వర్షం కారణంగా రద్దు కావడంతో..మెరుగైన రన్ రేట్ తో పాటు లీగ్ దశలో అత్యధిక విజయాలు సాధించిన భారత్ ను ఫైనల్స్ చేరినట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది.

గ్రూప్ -ఏ లీగ్ లో భారత్ ఆడిన నాలుగుకు నాలుగుమ్యాచ్ లూ నెగ్గడం ద్వారా 8 పాయింట్లతో గ్రూపు టాపర్ గా ఫైనల్స్ చేరుకోగలిగింది. అదే ఇంగ్లండ్ మాత్రం.. గ్రూప్-బీ లీగ్ లో నాలుగుమ్యాచ్ లకు మూడుమాత్రమే నెగ్గి 6 పాయింట్లతో రెండోస్థానంలో నిలవడం ద్వారా…సెమీస్ బెర్త్ సాధించినా వానదెబ్బతో మ్యాచ్ రద్దు కావడంతో నిష్క్ర్రమించక తప్పలేదు.

ఇంగ్లండ్ కెప్టెన్ నిరాశ…

ప్రపంచకప్ కే కీలకంగా ఉండే సెమీఫైనల్స్ లాంటి మ్యాచ్ లకు రిజర్వ్ డే లేకపోడం పట్ల ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ వైట్ తీవ్రనిరాశ వ్యక్తం చేసింది. తాము సెమీఫైనల్స్ చేరినా…వానదెబ్బతో మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి నిష్క్ర్రమించాల్సి రావడం బాధాకరమని, ఇంతకంటే దురదృష్టం మరొకటి ఉండదని ఇంగ్లండ్ కెప్టెన్ వాపోయింది.

ప్రపంచకప్ లో భారత్ ప్రత్యర్థిగా గత ఆరుటోర్నీలలో ఐదుసార్లు తలపడిన ఇంగ్లండ్ ఐదుకు ఐదుమ్యాచ్ లూ నెగ్గి నూటికి నూరుశాతం రికార్డుతో ఉంది. అయితే… ప్రస్తుత ప్రపంచకప్ లో మాత్రమే…భారత్ తో తలపడకుండానే వానదెబ్బతో పరాజయం చవిచూడాల్సి వచ్చింది.

నిబంధనలు అంతే మరి- హర్మన్ ప్రీత్ కౌర్..

భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సైతం ప్రపంచకప్ సెమీస్ కు రిజర్వ్ డే లేకపోడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రపంచకప్ లో పాల్గొనటానికి ముందే తమకు నిబంధనల గురించి స్పష్టంగా తెలుసునని, నిబంధనలు అంతకర్కశంగా ఉంటాయని చెప్పింది. మ్యాచ్ ఆడి గెలిచిఉంటే బాగుండేదని…అయినా మెరుగైన జట్టుగా…నిబంధనల ప్రకారం తాము పైనల్స్ చేరుకోగలిగామని భారత కెప్టెన్ వివరించింది.

ఫైనల్లో సౌతాఫ్రికా ఓటమి…

లీగ్ దశలో సంచలన విజయాలు సాధించడం ద్వారా తొలిసారిగా ప్రపంచకప్ సెమీస్ చేరిన సౌతాఫ్రికా ..ఫైనల్స్ కు చేరుకోడంలో విఫలమయ్యింది. సిడ్నీ వేదికగానే డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్ర్రేలియాతో జరిగిన రెండోసెమీఫైనల్లో..డక్ వర్త్ లూయిస్ విధానం ద్వారా 5 పరుగుల ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

గత ఆరు ప్రపంచకప్ టోర్నీలలో ఐదుసార్లు విజేత ఆస్ట్ర్రేలియా మార్చి 8న మెల్బోర్న్ వేదికగా జరిగే టైటిల్ సమరంలో డార్క్ హార్స్ భారత్ తో తలపడనుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో…ప్రపంచ మహిళా దినోత్సవం రోజున…లక్షమంది అభిమానుల సమక్షంలో ప్రపంచకప్ ఫైనల్స్ నిర్వహించడానికి భారీస్థాయిలో …గతంలో ఎన్నడూలేనంతగా ఏర్పాట్లు చేశారు.

First Published:  5 March 2020 9:35 PM GMT
Next Story