Telugu Global
National

కడపలో స్విస్‌ స్టీల్‌ ప్లాంట్.... మీడియాకు మింగుడు పడడం లేదు

వైసీపీ ప్రభుత్వం కొలువుదీరినప్పటినుంచీ ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు, ఆ పార్టీ అనుకూల పత్రికలు, టీవీ ఛానల్స్‌…. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతినిర్ణయానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం… పత్రికలు వార్తలను వండి వార్చడం, వాటిని ప్రచారం చేయడం చేస్తున్నాయి. ఇసుక నుంచి మొదలుకుని గ్రామ వాలంటీర్ల నియమకాలు, మద్యం పాలసీని, మూడు రాజధానుల విషయం వరకూ వరుసగా వ్యతిరేక కథనాలతో హోరెత్తించాయి. అయితే స్థానికంగా ప్రజలనుంచి కానీ, సోషల్‌ మీడియాలో కానీ కనీస స్పందన కూడా కరువవడంతో… ప్రభుత్వాన్ని ఇరుకున […]

కడపలో స్విస్‌ స్టీల్‌ ప్లాంట్.... మీడియాకు మింగుడు పడడం లేదు
X

వైసీపీ ప్రభుత్వం కొలువుదీరినప్పటినుంచీ ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు, ఆ పార్టీ అనుకూల పత్రికలు, టీవీ ఛానల్స్‌…. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతినిర్ణయానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం… పత్రికలు వార్తలను వండి వార్చడం, వాటిని ప్రచారం చేయడం చేస్తున్నాయి. ఇసుక నుంచి మొదలుకుని గ్రామ వాలంటీర్ల నియమకాలు, మద్యం పాలసీని, మూడు రాజధానుల విషయం వరకూ వరుసగా వ్యతిరేక కథనాలతో హోరెత్తించాయి.

అయితే స్థానికంగా ప్రజలనుంచి కానీ, సోషల్‌ మీడియాలో కానీ కనీస స్పందన కూడా కరువవడంతో… ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఐటీ కంపెనీలు, అంతర్జాతీయ కంపెనీలు, పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయంటూ భారీ స్థాయిలో ప్రచారం చేశాయి… కియా మోటర్స్‌ వెళ్ళిపోతోందంటూ అంతర్జాతీయ మీడియాలో కూడా ప్రచారం చేయించారు… అయితే అవి తప్పుడు వార్తలేనని స్వయంగా ఆ కంపెనీ ప్రతినిధులే బహిరంగా ప్రకటించారు కూడా.

అయితే పెట్టుబడులు వెనక్కి పోతున్నాయంటూ గతంలో చేసిన ప్రచారం తప్పుడు ప్రచారమేనని…. సదరు పత్రికలు,టీవీ ఛానళ్ళు మరోసారి నిరూపించుకున్నాయి .

”ఐఎంఆర్‌ ఏజీ” అనే స్విడ్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ కంపెనీ కడపలో 12 వేల కోట్ల తో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు జగన్‌ ను కలిశారు. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో 10 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ పెట్టడాని ఆసక్తి చూపుతున్నట్లు… ఆ కంపెనీ ప్రతినిధులు జగన్‌కు ప్రతిపాదించారు.

ఇప్పటికే ఈ కంపెనీ భారత్‌ సహా ఇటలీ, దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, మెక్సికో, ఇండోనేషియా, కొలంబియా లాంటి దేశాల్లో…. బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం గనుల తవ్వకాలతోపాటు ఉక్కు, విద్యుత్ కర్మాగారాలను నిర్వహిస్తున్నట్లు… సీఎంకు వివరించారు ఆ కంపెనీ ప్రతినిధులు.

స్టీల్ ప్లాంట్ కు ఇది అనువైన ప్రాంతం అని…. రోడ్డు, రైల్వే మార్గంతో పాటు కృష్ణపట్నం పోర్టుతో మెరుగైన రవాణా సదుపాయం కూడా ఉందని జగన్‌ కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. ఎన్‌ఎండీసీతో ఇనుప ఖనిజం సరఫరాకు ఒప్పందం కూడా చేసుకున్నామని… స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయం అందిస్తామని… విద్యుత్తు, నీరు లాంటి మౌలిక సదుపాయాలను అందించేందుకు ప్రయత్నాలను కూడా వేగవంతం చేశామని ”ఐఎంఆర్‌ ఏజీ” ప్రతినిధులకు హామీ ఇచ్చారు సీఎం జగన్‌. అనంతరం ఈ బృందం బ్రహ్మణి స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించింది.

First Published:  6 March 2020 1:20 AM GMT
Next Story