Telugu Global
NEWS

ఐపీఎల్ బోర్డు పొదుపు బాట!

ప్రైజ్ మనీలో భారీగా కోత, ప్రారంభవేడుకలు రద్దు సగానికి సగం ఖర్చు తగ్గించుకొనే పనిలో బోర్డు ప్రపంచంలో అత్యంత భాగ్యవంతమైన టీ-20 క్రికెట్ నిర్వాహక సంఘం ఐపీఎల్ బోర్డు ఆలస్యంగానైనా పొదుపుబాట పట్టింది. గత 12 సీజన్లుగా విలాసాలు, దుబారా ఖర్చులతో విపరీతంగా ఖర్చు పెట్టిన ఐపీఎల్ బోర్డు 2020 సీజన్ నుంచి పొదుపు మంత్రాన్ని జపిస్తోంది. ఖర్చులను సగానికి సగం తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు ఫ్రాంచైజీలకు సమాచారం అందించింది. ప్రారంభవేడుకలకు స్వస్తి…. ప్రపంచ క్రికెట్లోనే అత్యధికంగా 47 వేల […]

ఐపీఎల్ బోర్డు పొదుపు బాట!
X
  • ప్రైజ్ మనీలో భారీగా కోత, ప్రారంభవేడుకలు రద్దు
  • సగానికి సగం ఖర్చు తగ్గించుకొనే పనిలో బోర్డు

ప్రపంచంలో అత్యంత భాగ్యవంతమైన టీ-20 క్రికెట్ నిర్వాహక సంఘం ఐపీఎల్ బోర్డు ఆలస్యంగానైనా పొదుపుబాట పట్టింది. గత 12 సీజన్లుగా విలాసాలు, దుబారా ఖర్చులతో విపరీతంగా ఖర్చు పెట్టిన ఐపీఎల్ బోర్డు 2020 సీజన్ నుంచి పొదుపు మంత్రాన్ని జపిస్తోంది. ఖర్చులను సగానికి సగం తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు ఫ్రాంచైజీలకు సమాచారం అందించింది.

ప్రారంభవేడుకలకు స్వస్తి….

ప్రపంచ క్రికెట్లోనే అత్యధికంగా 47 వేల 500 కోట్ల రూపాయల బ్రాండ్ విలువ కలిగిన ఐపీఎల్. 2008 నుంచి 2019 సీజన్ల వరకూ కొద్దినిముషాలలోనే ముగిసిపోయే టోర్నీ ప్రారంభవేడుకలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ వచ్చింది. కత్రినా కైఫ్, అనుష్కశర్మ, షారుక్ ఖాన్,హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా లాంటి సెలబ్రిటీలకు కోట్ల రూపాయలు ధారపోస్తూ వచ్చింది. అయితే మార్చి 29 నుంచి జరుగనున్న 13వ సీజన్ ఐపీఎల్ ను ప్రారంభవేడుకలు లేకుండానే నిర్వహించాలని నిర్ణయించింది.

ప్రైజ్ మనీలో సగం కోత…

ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టుకు గత సీజన్ వరకూ 20 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా ఇస్తూ వచ్చారు. 2019 ఐపీఎల్ విన్నర్ ముంబై ఇండియన్స్ కు 20 కోట్లు, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ కు 10 కోట్ల రూపాయలు చెల్లించారు. మూడు, నాలుగుస్థానాలలో నిలిచినజట్లకు 8 కోట్ల 75 రూపాయల చొప్పున ఇచ్చారు.

అయితే…2020 సీజన్ నుంచి ఐపీఎల్ విజేతకు 10 కోట్లు, రన్నరప్ కు 6 కోట్ల 25 లక్షలు, మూడు, నాలుగు స్థానాలలో నిలిచిన జట్లకు 4 కోట్ల 37 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది.

బిజినెస్ క్లాస్ టికెట్లు బంద్…

ఐపీఎల్ నిర్వహణ పేరుతో నిర్వాహక సంఘం ప్రతినిధులు, అధికారులకు ఇప్పటి వరకూ 3 గంటల ప్రయాణం దాటితే బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణం టికెట్లు ఇస్తూ వచ్చారు. ప్రస్తుత సీజన్ నుంచి 8 గంటల సమయం దాటితేనే బిజినెస్ క్లాస్ సదుపాయం కల్పించనున్నారు. ఇప్పటి వరకూ బిజినెస్ క్లాస్ విలాసాన్ని అనుభవించిన అధికారులు, ప్రముఖులు ఇక నుంచి ఎకానమీ క్లాస్ లో ప్రయాణించక తప్పదు.

ఫ్రాంచైజీలకూ కోత…

వివిధ ఫ్రాంచైజీల తరపున ఆడుతున్న విదేశీ క్రికెటర్లు అర్థంతరంగా టోర్నీ నుంచి ఉపసంహరించుకొంటే…ఆ నష్టాన్ని పరిహారం రూపంలో ఐపీఎల్ బోర్డు ఇప్పటి వరకూ చెల్లించడం ద్వారా భరిస్తూ ఉండేది. ప్రస్తుత 13వ సీజన్ నుంచి ఆ సదుపాయాన్ని సైతం రద్దు చేశారు.

ఈ పొదుపు చర్యలతో భారీమొత్తంలో దుబారా ఖర్చుకు కళ్లెవేయనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. అయితే…ఐపీఎల్ బోర్డు పొదుపు చర్యల పట్ల కొన్ని ఫ్రాంచైజీల యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కోట్లరూపాయల ఆదాయం వస్తున్నప్పుడు ఖర్చు చేస్తే తప్పేంటంటూ ముఖం చిట్లిస్తున్నాయి.

ఐపీఎల్ బోర్డులు సభ్యులుగా ఉన్న మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు గత కొద్దిసీజన్లుగా లాభాలబాట పట్టడం విశేషం.

First Published:  7 March 2020 12:43 AM GMT
Next Story