Telugu Global
Cinema & Entertainment

రామ్ చరణ్ కు బ్రహ్మరథం

సినిమా ఫంక్షన్లకు, ప్రారంభోత్సవాలకు స్టార్ హీరోలు వెళ్లడం కామన్. అక్కడ వాళ్లకు అతిథి మర్యాదలు జరగడం కూడా అంతే కామన్. అయితే ఓ హీరో సినిమా ప్రారంభోత్సవానికి మరో హీరో వెళ్లినప్పుడు మాత్రం ఇలాంటి సత్కారాలు పెద్దగా ఉండవు. మరీ ముఖ్యంగా సినిమా ప్రారంభోత్సవం కాబట్టి ఓ గంట సేపు అలా కారులో వెళ్లి క్లాప్ కొట్టి వచ్చేస్తాడు ఏ స్టార్ హీరో అయినా. అయితే ఇక్కడ రామ్ చరణ్ విషయంలో మాత్రం వ్యవహారం వేరేలా ఉంది. […]

రామ్ చరణ్ కు బ్రహ్మరథం
X

సినిమా ఫంక్షన్లకు, ప్రారంభోత్సవాలకు స్టార్ హీరోలు వెళ్లడం కామన్. అక్కడ వాళ్లకు అతిథి మర్యాదలు జరగడం కూడా అంతే కామన్. అయితే ఓ హీరో సినిమా ప్రారంభోత్సవానికి మరో హీరో వెళ్లినప్పుడు మాత్రం ఇలాంటి సత్కారాలు పెద్దగా ఉండవు. మరీ ముఖ్యంగా సినిమా ప్రారంభోత్సవం కాబట్టి ఓ గంట సేపు అలా కారులో వెళ్లి క్లాప్ కొట్టి వచ్చేస్తాడు ఏ స్టార్ హీరో అయినా. అయితే ఇక్కడ రామ్ చరణ్ విషయంలో మాత్రం వ్యవహారం వేరేలా ఉంది. ఓ సినిమా ఓపెనింగ్ కు వెళ్లిన చరణ్ కు ఊహించని అతిథి సత్కారాలు, రాచమర్యాదలు జరిగాయి.

అవును.. మంచు మనోజ్ హీరోగా అహంబ్రహ్మష్మి అనే సినిమా ప్రారంభమైంది. ఈ మూవీ ఓపెనింగ్ కు రామ్ చరణ్ ను స్పెషల్ గెస్ట్ గా పిలిచారు. తనకు ఫ్రెండ్ కాబట్టి చరణ్ ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పాడు. ఇలా వచ్చి అలా వెళ్లిపోవచ్చని అనుకున్నాడు. కానీ చరణ్ కోసం మంచు మనోజ్ కనివినీ ఎరుగని ఏర్పాట్లు చేశాడు. జస్ట్ ఓపెనింగ్ కు వచ్చిన రామ్ చరణ్ కోసం ఏకంగా కారవాన్ పెట్టించాడు. అందులో కాసేపు సేదతీరిన తర్వాత ఓపెనింగ్ కు వచ్చాడు చరణ్. అక్కడితో ఆగలేదు. ప్రత్యేకంగా మనుషుల్ని పెట్టించి చెర్రీపై పూలవర్షం కురిపించాడు మనోజ్.

అతిథి మర్యాదలు అక్కడితో కూడా ముగియలేదు. సినిమా ఓపెనింగ్ కంటే ముందు చెర్రీకి మోహన్ బాబు చేతుల మీదుగా అక్కడికక్కడే చిరు సత్కారం కూడా జరిగిపోయింది. ప్రదేశం మొత్తం జై మెగా పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తిపోయింది. ఊహించని ఈ రిసీవింగ్ కు చరణ్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆనందంగా క్లాప్ కొట్టి, అంతే ఆనందంతో అందర్నీ కౌగలించుకొని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. చరణ్ కు ఆనందం, మనోజ్ కు ప్రచారం.

First Published:  7 March 2020 12:57 AM GMT
Next Story