Telugu Global
NEWS

ఆల్ ఇంగ్లండ్ టైటిల్ కు భారత స్టార్ షట్లర్లు

టైటిల్ వేటలో సింధు, సైనా, శ్రీకాంత్ ప్రపంచంలోనే అత్యంత పురాతన బ్యాడ్మింటన్ టోర్నీ 110వ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సమరానికి భారతస్టార్ షట్లర త్రయం పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిండాబీ శ్రీకాంత్ సిద్ధమయ్యారు. ఓ వైపు కరోనావైరస్‌ భయం వెంటాడుతున్నా…తాము పోటీలలో పాల్గొనటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కరోనా భయంతో ఇప్పటికే భారత్ కు చెందిన ఏడుగురు ప్లేయర్లు టోర్నీ నుంచి ఉపసంహరించుకోగా…సైనా,సింధు, శ్రీకాంత్ లతో సహా వివిధ దేశాలకు చెందిన 160మంది బరిలోకి దిగనున్నారు. టోక్యో ఒలింపిక్స్ […]

ఆల్ ఇంగ్లండ్ టైటిల్ కు భారత స్టార్ షట్లర్లు
X
  • టైటిల్ వేటలో సింధు, సైనా, శ్రీకాంత్

ప్రపంచంలోనే అత్యంత పురాతన బ్యాడ్మింటన్ టోర్నీ 110వ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సమరానికి భారతస్టార్ షట్లర త్రయం పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిండాబీ శ్రీకాంత్ సిద్ధమయ్యారు. ఓ వైపు కరోనావైరస్‌ భయం వెంటాడుతున్నా…తాము పోటీలలో పాల్గొనటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

కరోనా భయంతో ఇప్పటికే భారత్ కు చెందిన ఏడుగురు ప్లేయర్లు టోర్నీ నుంచి ఉపసంహరించుకోగా…సైనా,సింధు, శ్రీకాంత్ లతో సహా వివిధ దేశాలకు చెందిన 160మంది బరిలోకి దిగనున్నారు.

టోక్యో ఒలింపిక్స్ అర్హత కు కీలకం…

ప్రపంచ చాంపియన్ పీవీ సింధు ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకోగా…కిడాంబీ శ్రీకాంత్, సైనా నెహ్వాల్ లకు మాత్రం..ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో స్థాయికి తగ్గట్టుగా రాణించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ర్యాంకింగ్స్ పాయింట్లలో బాగా వెనుకబడిన సైనా, శ్రీకాంత్ కనీసం సెమీస్ చేరినా ఒలింపిక్స్ బెర్త్ సాధించగలుగుతారు.

ఇద్దరే భారత విజేతలు..

ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చరిత్రను ఒక్కసారి తిరగేసి చూస్తే..గత 109 సంవత్సరాల టోర్నీలలో భారత్ కు చెందిన ఇద్దరంటే ఇద్జరు మాత్రమే విజేతలుగా నిలువగలిగారు.

1980లో ప్రకాశ్ పడుకోన్ ఆల్ ఇంగ్లండ్ టైటిల్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టిస్తే…ఆ తర్వాత రెండుదశాబ్దాలవిరామం తర్వాత పుల్లెల గోపీచంద్ అదే టైటిల్ నెగ్గి… ప్రకాశ్ సరసన నిలువగలిగాడు.

మహిళల విభాగంలో సైనా, సింధు తమవంతు ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకూ సఫలం కాలేకపోయారు.

మహిళల సింగిల్స్ లో హోరాహోరీ…

మహిళల సింగిల్స్ రేస్ లో చైనీస్ తైపీ ప్లేయర్ తాయ్ ఈ జుంగ్, జపాన్ జోడీ ఒకుహరా, యమగుచి, చైనా స్టార్ ప్లేయర్ యూ వే ఫీ, థాయ్ లాండ్ నంబర్ వన్ రచనోక్ ఇంటానన్ ల నుంచి సింధుకు ప్రధానంగా పోటీ ఎదురుకానుంది.

గత మూడుమాసాలుగా వరుస పరాజయాలతో డీలా పడిన సింధు…ఆల్ ఇంగ్లండ్ తో పుంజుకోడం ద్వారా…టోక్యో ఒలింపిక్స్ బరిలో నిలవాలన్న పట్టుదలతో ఉంది. ఆల్ ఇంగ్లండ్ తొలిరౌండ్లో అమెరికా ప్లేయర్ బీవెన్ జాంగ్ తో సింధు, యమగుచితో సైనా నెహ్వాల్ తలపడనున్నారు.

First Published:  7 March 2020 9:00 PM GMT
Next Story