రజనీకాంత్ సినిమాలో గోపీచంద్

ప్రస్తుతం ఫిలినగర్ లో చక్కర్లు కొడుతున్న ఈ మేటర్ నిజమైతే.. త్వరలోనే రజనీకాంత్ సినిమాలో గోపీచంద్ ఓ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. శివ దర్శకత్వంలో రజనీకాంతో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఇందులో ఓ కీలక పాత్ర ఉంది. దాని కోసం గోపీచంద్ పేరును పరిశీలిస్తున్నారు.

ఈ సినిమాలో ఓ చిన్న పాత్రను క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే హీరో పోషిస్తే బాగుంటుందని శివ అభిప్రాయపడ్డాడు. ఇదే విషయం రజనీకాంత్ కు కూడా చెప్పాడు. సూపర్ స్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో గోపీచంద్ తో పాటు పలువురు పేర్లను లిస్ట్ చేసి పెట్టాడు శివ. రజనీ వీళ్ల నుంచి ఒకర్ని సెలక్ట్ చేయాల్సి ఉంది.

శివ, గోపీచంద్ మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంది. శివను దర్శకుడిగా పరిచయం చేసిందే గోపీచంద్. ఆ తర్వాత తన రెండో సినిమాను కూడా గోపీచంద్ తోనే చేశాడు ఈ దర్శకుడు. ఆ తర్వాత స్టార్ డైరక్టర్ గా మారి పూర్తిగా కోలీవుడ్ కు పరిమితం అయిపోయాడు. ఇప్పుడీ దర్శకుడు, రజనీకాంత్ సినిమాలోకి తన తొలి హీరో గోపీచంద్ ను తీసుకోవాలని అనుకుంటున్నాడు. త్వరలోనే ఈ మేటర్ పై ఓ క్లారిటీ రానుంది.