పాట ఓకే, టైమింగ్ ఓకే…. కానీ?

వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి ఓ పాట రిలీజ్ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మగువా మగువా అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను అఫీషియల్ గా సోషల్ మీడియాలో లాంచ్ చేశారు. మహిళలకు దీన్ని అంకితం చేశారు. అంతా బాగానే ఉంది కానీ సినిమాకు ఇది ఏ రేంజ్ లో ఉపయోగపడుతుందనేది ప్రశ్న.

ఎప్పట్లానే తమన్ మంచి ట్యూన్ అందించాడు. ట్యూన్ మంచిదే కానీ క్యాచీగా కాదు. పవన్ ఫ్యాన్స్ హమ్ చేసుకునే పాట కూడా కాదిది. మరీ ముఖ్యంగా తమన్-సిద్ శ్రీరామ్ కాంబినేషన్ స్థాయికి తగ్గ పాట అస్సలే కాదు. తమ అభిమాన హీరో సినిమా నుంచి వచ్చిన సాంగ్ కాబట్టి వాళ్లు బాగానే రిసీవ్ చేసుకున్నారు కానీ, అది సినిమాకు ఏమేరకు ఉపయోగపడుతుందనేది ప్రస్తుతానికి ప్రశ్న.

రామజోగయ్య శాస్త్రి సాహిత్యం మాత్రం చాలా బాగుంది. మగువ గొప్పదనాన్ని, ఆమె విలువను చాటిచెప్పేలా మంచి లైన్స్ రాశాడు రామజోగయ్య శాస్త్రి. మే నెలలో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.