బ్రోచే దర్శకుడితో నాని

మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు వివేక్ ఆత్రేయ. కేవలం హిట్స్ కొట్టడమే కాదు, సెన్సిబుల్ డైరక్టర్ అనిపించుకున్నాడు కూడా. ఇప్పుడీ దర్శకుడు తన మూడో సినిమాకు ఏకంగా బంపరాఫర్ అందుకున్నాడు. నేచురల్ స్టార్ నానిని డైరక్ట్ చేసే అవకాశం కొట్టేశాడు.

బ్రోచేవారెవరురా హిట్టయిన వెంటనే వివేక్ ను లాక్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఇప్పుడు అదే బ్యానర్ పై నాని హీరోగా సినిమా చేయబోతున్నాడు ఈ డైరక్టర్. వివేక్ ఆత్రేయ చెప్పిన ఓ స్టోరీలైన్ నానికి బాగా నచ్చింది. వెంటనే నటించడానికి ఒప్పుకున్నాడు.

ప్రస్తుతం టక్ జగదీశ్ సినిమా చేస్తున్నాడు నాని. ఈ మూవీ తర్వాత సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శ్యామ్ సింగరాయ్ అనే సినిమా లైన్లో ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే మైత్రీ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ అవుతుంది. నాని నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డాడు వివేక్ ఆత్రేయ.