నాగచైతన్యకు ఎలాంటి టెన్షన్ లేదు

పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు నాగచైతన్య. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఆ మూవీ అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కట్ చేస్తే, ఇప్పుడు అదే పరశురామ్, మహేష్ తో సంప్రదింపులు జరుపుతున్నాడు. మహేష్-మైత్రీ-పరశురామ్ కాంబోలో సినిమా దాదాపు ఫిక్స్ అయ్యేలా ఉంది. మరి ఇప్పుడు నాగచైతన్య పరిస్థితేంటి?

మహేష్ తో పోలిస్తే ప్లానింగ్ విషయంలో నాగచైతన్య చాలా పెర్ ఫెక్ట్ గా ఉన్నాడు. లవ్ స్టోరీ సినిమా షూటింగ్ ను దాదాపు క్లైమాక్స్ కు తీసుకొచ్చిన చైతూ.. ఆ మూవీ అయిన వెంటనే పరశురామ్ సినిమాను స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. ఒకవేళ మహేష్ వల్ల పరశురామ్ అందుబాటులోకి రాలేకపోతే మరో ఇద్దరు-ముగ్గురు దర్శకులు రెడీగా ఉన్నారు. వీళ్లలో మారుతి కూడా ఒకడు.

సో.. నాగచైతన్యతో సినిమా లేట్ చేస్తే అది పరశురామ్ కే ప్రమాదం. ఇప్పటికే గీతగోవిందం తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. ఇప్పటికైనా మహేష్ లాంటి స్టార్ కోసం వెంటపడకుండా, నాగచైతన్యతో బుద్ధిగా సినిమా చేసుకుంటే బెటర్. లేదంటే.. రెంటికి చెడ్డ రేవటిలా తయారవుతుంది పరశురాం పరిస్థితి.