కల్యాణి కొత్త అవతారం

ఒకప్పటి హీరోయిన్ కల్యాణి కొన్నాళ్ల పాటు కెరీర్ కు గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మారారు. ఇప్పుడీ నటి ఏకంగా దర్శకురాలిగా మారబోతున్నారు. అంతేకాదు.. ఒకేసారి నిర్మాతగా కూడా మారబోతున్నారు.

అవును.. స్వీయదర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడానికి రెడీ అయ్యారు కల్యాణి. ఈమె డైరక్ట్ చేయబోయే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు పూరి జగన్నాధ్ విడుదల చేశాడు.

కే2కే ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించారు కల్యాణి. ఈ బ్యానర్ పై తన తమ్ముడు చేతన్ హీరోగా ఓ సినిమా డైరక్ట్ చేయబోతున్నారు. యదార్థ ఘటనల ఆధారంగా లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాలో సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు కల్యాణి.

బాల‌న‌టిగా కెరీర్ ఆరంభించిన క‌ల్యాణి, 1986 నుంచి సినిమాల్లో న‌టిస్తూ వ‌స్తున్నారు. తన అనుభవంతో ఇప్పుడిలా ఒకేసారి దర్శకనిర్మాతగా మారారు.