Telugu Global
International

ఒలింపిక్స్ జ్యోతి ప్రజ్వలనానికీ కరోనా దెబ్బ

ప్రేక్షకులు లేకుండానే ఏథెన్స్ లో ఏర్పాట్లు టోక్యో ఒలింపిక్స్ కోసం.. గ్రీస్ రాజధాని ఏధెన్స్ లో నిర్వహించాల్సిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి సైతం కరోనా వైరస్ సెగ తాగింది. సాధారణంగా.. ఏధెన్స్ వేదికగా వేలాదిమంది సమక్షంలో ఒలింపిక్స్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని వేలాదిమంది సమక్షంలో అట్టహాసంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఏథెన్స్ లోని పురాతన ఒలింపిక్స్ వేదిక సమీపంలో సూర్యకిరణాలతో రాజేసిని ఒలింపిక్స్ జ్యోతిని… పోటీలకు ఆతిథ్యమిచ్చే దేశానికి ప్రత్యేక విమానంలో తీసుకువెళ్ళడం తరతరాలుగా వస్తున్న ఆచారం. టోక్యో వేదికగా […]

ఒలింపిక్స్ జ్యోతి ప్రజ్వలనానికీ కరోనా దెబ్బ
X
  • ప్రేక్షకులు లేకుండానే ఏథెన్స్ లో ఏర్పాట్లు

టోక్యో ఒలింపిక్స్ కోసం.. గ్రీస్ రాజధాని ఏధెన్స్ లో నిర్వహించాల్సిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి సైతం కరోనా వైరస్ సెగ తాగింది. సాధారణంగా.. ఏధెన్స్ వేదికగా వేలాదిమంది సమక్షంలో ఒలింపిక్స్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని వేలాదిమంది సమక్షంలో అట్టహాసంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఏథెన్స్ లోని పురాతన ఒలింపిక్స్ వేదిక సమీపంలో సూర్యకిరణాలతో రాజేసిని ఒలింపిక్స్ జ్యోతిని… పోటీలకు ఆతిథ్యమిచ్చే దేశానికి ప్రత్యేక విమానంలో తీసుకువెళ్ళడం తరతరాలుగా వస్తున్న ఆచారం.

టోక్యో వేదికగా మరికొద్దిమాసాలలో ప్రారంభంకానున్న 2020 ఒలింపిక్స్ కు సైతం క్రీడల పుట్టినిల్లు ఏథెన్స్ లో…జ్యోతిని గురువారం రాజేయాల్సి ఉంది.

వేలాదిమంది సమక్షంలో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులు లేకుండానే …కేవలం ఎంపిక చేసిన 100 మంది ప్రముఖుల సమక్షంలోనే నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం నిర్ణయించింది.

గ్రీస్ లో సైతం కరోనా వైరస్ వ్యాపించడం, రోగుల సంఖ్య 7 నుంచి 73కు పెరగడంతో… రెండువారాల పాటు భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొనే క్రీడా కార్యక్రమాలను ప్రభుత్వం రెండు వారాలపాటు రద్దు చేసింది. దీంతో ఒలింపిక్స్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి సైతం దెబ్బతలిగింది.

ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలోనే రెండోసారి… అభిమానులు లేకుండా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ కు సైతం అభిమానులు లేకుండానే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత 35 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి అదే పరిస్థితి పునరావృతమయ్యింది.

ఒలింపిక్స్ జ్యోతి ప్రజ్వలన డ్రెస్ రిహార్సల్స్, అధికారిక కార్యక్రమాలకు… కేవలం 100 మందిని మాత్రమే ఆహ్వానించామని, అభిమానులకు ఆహానం లేదని గ్రీస్ ఒలింపిక్ కమిటీ అధికారికంగా ప్రకటించింది.

ఏథెన్స్ నుంచి ప్రత్యేక విమానంలో ఒలింపిక్‌ జ్యోతిని జపాన్ కు తీసుకువెళ్లిన తర్వాత… జపాన్ వ్యాప్తంగా ఏడురోజులపాటు టార్చ్ రిలే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

First Published:  9 March 2020 11:34 PM GMT
Next Story