Telugu Global
Cinema & Entertainment

చిరు సినిమాపై రెజీనా క్లారిటీ

చిరంజీవి-కొరటాల శివ సినిమా ఇలా ప్రారంభమైందో లేదో అలా రెజీనా సెట్స్ పైకి వచ్చేసింది. ఫస్ట్ షెడ్యూల్ లో చిరంజీవి-రెజీనాపైనే ఓ సాంగ్ తీశారు. ఎట్టకేలకు ఆ సాంగ్ పై రెజీనా రియాక్ట్ అయింది. అంతా అనుకుంటున్నట్టు అది ఐటెంసాంగ్ కాదంటోంది రెజీనా. చిరంజీవి సినిమాలో తనది ఐటెంసాంగ్ కాదని, ఓ సెలబ్రేషన్ టైమ్ లో వచ్చే స్పెషల్ సాంగ్ అని చెబుతోంది రెజీనా. స్వతహాగా తను ఐటెంసాంగ్స్ చేయనని, చిరంజీవి సినిమాలో కూడా ఐటెంసాంగ్ అయితే […]

చిరు సినిమాపై రెజీనా క్లారిటీ
X

చిరంజీవి-కొరటాల శివ సినిమా ఇలా ప్రారంభమైందో లేదో అలా రెజీనా సెట్స్ పైకి వచ్చేసింది. ఫస్ట్ షెడ్యూల్ లో చిరంజీవి-రెజీనాపైనే ఓ సాంగ్ తీశారు. ఎట్టకేలకు ఆ సాంగ్ పై రెజీనా రియాక్ట్ అయింది. అంతా అనుకుంటున్నట్టు అది ఐటెంసాంగ్ కాదంటోంది రెజీనా.

చిరంజీవి సినిమాలో తనది ఐటెంసాంగ్ కాదని, ఓ సెలబ్రేషన్ టైమ్ లో వచ్చే స్పెషల్ సాంగ్ అని చెబుతోంది రెజీనా. స్వతహాగా తను ఐటెంసాంగ్స్ చేయనని, చిరంజీవి సినిమాలో కూడా ఐటెంసాంగ్ అయితే చేయనని చెప్పానని, కానీ అది అంతకుమించి అని తెలియడంతో చేశానంటోంది రెజీనా.

చిరంజీవి సినిమాలో తను ఐటెంసాంగ్ చేశాననే ప్రచారం జరగడంతో చాలామంది మేకర్స్ తనను ఐటెంసాంగ్ ఆఫర్లతో కలుస్తున్నారని.. దయచేసి ఐటెంసాంగ్ ఆఫర్లతో రావొద్దని విజ్ఞప్తి చేస్తోంది రెజీనా. డాన్స్ విషయంలో చిరంజీవిని కొట్టే హీరో ఇప్పటివరకు రాలేదంటున్న రెజీనా, డాన్స్ లో అతడి టైమింగ్ అందుకోవడం ఎవ్వరితరం కాదంటోంది.

First Published:  10 March 2020 4:34 AM GMT
Next Story