Telugu Global
CRIME

కరోనా అనుమానితుడి కోసం సెర్చ్ ఆపరేషన్... ఎందుకో తెలుసా...?

కరోనా అనుమానితుడి కోసం కర్ణాటక ఆరోగ్య అధికారులు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. అదేంటీ.. రోగి కోసం అధికారులు పరీక్షలు చేయాలి లేదా చికిత్స చేయాలి. కానీ ఈ గాలింపు చర్యలేంటి అని ఆశ్చర్యపోతున్నారా…. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్దాం.. మార్చి 8న అంటే ఆదివారం రోజు దుబాయ్ నుంచి ఒక వ్యక్తి మంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఆ విమానాశ్రయంలో వైద్యులు పరీక్షలు చేయగా కరోనాకు సంబంధించి లక్షణాలు కనపడ్డాయి. సదరు ప్రయాణికుడు తీవ్రమైన జ్వరంతో పాటు […]

కరోనా అనుమానితుడి కోసం సెర్చ్ ఆపరేషన్... ఎందుకో తెలుసా...?
X

కరోనా అనుమానితుడి కోసం కర్ణాటక ఆరోగ్య అధికారులు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. అదేంటీ.. రోగి కోసం అధికారులు పరీక్షలు చేయాలి లేదా చికిత్స చేయాలి. కానీ ఈ గాలింపు చర్యలేంటి అని ఆశ్చర్యపోతున్నారా…. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్దాం..

మార్చి 8న అంటే ఆదివారం రోజు దుబాయ్ నుంచి ఒక వ్యక్తి మంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఆ విమానాశ్రయంలో వైద్యులు పరీక్షలు చేయగా కరోనాకు సంబంధించి లక్షణాలు కనపడ్డాయి. సదరు ప్రయాణికుడు తీవ్రమైన జ్వరంతో పాటు దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడు. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ వైద్య సిబ్బంది తదుపరి పరీక్షల కోసం అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడే అసలు ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి సిబ్బందితో తనకు కరోనా సోకలేదని వాగ్వివాదానికి దిగాడు. తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతూ అందరినీ తిట్టేశాడు. అక్కడ ఉన్న ఆసుపత్రి సిబ్బంది అతడిని శాంతపర్చి కూర్చోబెట్టారు. కానీ కొద్దిసేపటికే కరోనా అనుమానితుడు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోయాడు.

అతడికి కరోనా లక్షణాలు ఉన్నాయని.. బయట తిరిగితే ఇతరులకు ప్రమాదం అని గ్రహించిన వైద్య సిబ్బంది వెంటనే అతడి కోసం గాలింపు చేపట్టారు. ఇప్పటికే కర్ణాటక పోలీసులకు కూడా విషయం చేరవేయడంతో వాళ్లు కూడా అతని కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు.

First Published:  9 March 2020 8:23 PM GMT
Next Story