Telugu Global
Cinema & Entertainment

వకీల్ సాబ్ కొత్తగా కనిపిస్తాడు

హిందీలో పింక్ సినిమా చాలామంది చూసే ఉంటారు. అందులో అమితాబ్ బచ్చన్ పాత్ర, అతడి గెటప్ పై ఓ అవగాహనకు వచ్చి ఉంటారు. అలాగే తమిళ్ లో అజిత్ చేసిన పింక్ రీమేక్ కూడా చాలామంది చూసే వారు. అందులో కూడా అజిత్ పాత్రపై ఓ అభిప్రాయానికి వచ్చి ఉంటారు. ఇప్పుడు తెలుగులో అదే సినిమాను పవన్ రీమేక్ చేస్తున్నాడు. దీంతో అజిత్ క్యారెక్టర్ టైపులోనే పవన్ పాత్ర ఉంటుందని చాలామంది భావిస్తూ వస్తున్నారు. దీనిపై మరోసారి […]

వకీల్ సాబ్ కొత్తగా కనిపిస్తాడు
X

హిందీలో పింక్ సినిమా చాలామంది చూసే ఉంటారు. అందులో అమితాబ్ బచ్చన్ పాత్ర, అతడి గెటప్ పై ఓ అవగాహనకు వచ్చి ఉంటారు. అలాగే తమిళ్ లో అజిత్ చేసిన పింక్ రీమేక్ కూడా చాలామంది చూసే వారు. అందులో కూడా అజిత్ పాత్రపై ఓ అభిప్రాయానికి వచ్చి ఉంటారు. ఇప్పుడు తెలుగులో అదే సినిమాను పవన్ రీమేక్ చేస్తున్నాడు. దీంతో అజిత్ క్యారెక్టర్ టైపులోనే పవన్ పాత్ర ఉంటుందని చాలామంది భావిస్తూ వస్తున్నారు. దీనిపై మరోసారి దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు.

హిందీ, తమిళ భాషల్లో వచ్చిన పింక్ సినిమాకు కంప్లీట్ డిఫరెంట్ గా వకీల్ సాబ్ ఉంటాడని చెబుతున్నాడు దిల్ రాజు. ఇప్పటికే ఆడియన్స్ 2 వెర్షన్లు చూశారని, త్వరలోనే మూడో వెర్షన్ చూస్తారని చెబుతున్నాడు. బిగ్ బి, అజిత్ పాత్రలతో పవన్ క్యారెక్టర్ కు ఏమాత్రం సంబంధం ఉండదని, అలా క్యారెక్టరైజేషన్ లో, కథలో మార్పు చేర్పులు చేశామంటున్నాడు.

ఒకే ఒక్క ఎపిసోడ్ మినహా వకీల్ సాబ్ షూటింగ్ పూర్తయింది. ఇప్పటికే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటు ఓ సింగిల్ రిలీజ్ చేశారు. త్వరలోనే టీజర్ ను కూడా లాంఛ్ చేయబోతున్నారు. మే నెలలో థియేటర్లలోకి రాబోతున్నాడు వకీల్ సాబ్.

First Published:  10 March 2020 11:30 AM GMT
Next Story