Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ మూవీ అప్ డేట్

ప్రభాస్ మూవీ అప్ డేట్ అధికారికంగా వచ్చింది. చాన్నాళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ మేకర్స్ ఎప్పుడూ ఆ విషయాన్ని అధికారికంగా చెప్పలేదు. ఈమధ్య కాలంలో ఒక్కటంటే ఒక్క అప్ డేట్ కూడా లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా తిట్ల దండకం అందుకున్నారు. దీంతో యూవీ క్రియేషన్స్ నిర్మాతల్లో చలనం వచ్చింది. ప్రభాస్ సినిమాకు సంబంధించి ప్రస్తుతం యూరోప్ లో ఓ షెడ్యూల్ నడుస్తోంది. ఓ ఛేజ్ సీక్వెన్స్ ను విదేశీ నిపుణుల ఆధ్వర్యంలో తెరకెక్కించినట్టు […]

ప్రభాస్ మూవీ అప్ డేట్
X

ప్రభాస్ మూవీ అప్ డేట్ అధికారికంగా వచ్చింది. చాన్నాళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ మేకర్స్ ఎప్పుడూ ఆ విషయాన్ని అధికారికంగా చెప్పలేదు. ఈమధ్య కాలంలో ఒక్కటంటే ఒక్క అప్ డేట్ కూడా లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా తిట్ల దండకం అందుకున్నారు. దీంతో యూవీ క్రియేషన్స్ నిర్మాతల్లో చలనం వచ్చింది.

ప్రభాస్ సినిమాకు సంబంధించి ప్రస్తుతం యూరోప్ లో ఓ షెడ్యూల్ నడుస్తోంది. ఓ ఛేజ్ సీక్వెన్స్ ను విదేశీ నిపుణుల ఆధ్వర్యంలో తెరకెక్కించినట్టు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ప్రకటించారు. అంతేకాదు.. త్వరలోనే యూరోప్ లో మరో భారీ షెడ్యూల్ ఉంటుందని కూడా ప్రకటించారు. ఇకపై ప్రభాస్ మూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తామని కూడా తెలిపారు.

ప్రభాస్ మూవీ నుంచి అప్ డేట్ రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇదే ఊపులో సినిమా టైటిల్ కూడా ప్రకటిస్తే ప్రభాస్ మేనియా ప్రారంభమైనట్టే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాథేశ్యామ్ లేదా ఓ డియర్ అనే టైటిల్ అనుకుంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్.

First Published:  10 March 2020 3:50 AM GMT
Next Story