Telugu Global
Cinema & Entertainment

ప్రతిష్టాత్మక రీమేక్ లో కాజల్

అవకాశాలు తగ్గాయని విమర్శలు వచ్చిన ప్రతిసారి తననుతాను నిరూపించుకుంటూ వస్తోంది కాజల్. ఇప్పుడు కూడా ఈ చందమామపై అలాంటి విమర్శలే చెలరేగుతున్నాయి. ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో ఆఖరికి మంచు విష్ణు సినిమాలో కూడా ఆమె నటిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడా విమర్శలకు అదిరిపోయే సమాధానం చెబుతోంది కాజల్. ఓ ప్రతిష్టాత్మక రీమేక్ ప్రాజెక్టులో హీరోయిన్ గా ఎంపికైంది కాజల్. కొరియన్ లో సూపర్ హిట్టయిన డాన్సింగ్ క్వీన్ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించాడు […]

ప్రతిష్టాత్మక రీమేక్ లో కాజల్
X

అవకాశాలు తగ్గాయని విమర్శలు వచ్చిన ప్రతిసారి తననుతాను నిరూపించుకుంటూ వస్తోంది కాజల్. ఇప్పుడు కూడా ఈ చందమామపై అలాంటి విమర్శలే చెలరేగుతున్నాయి. ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో ఆఖరికి మంచు విష్ణు సినిమాలో కూడా ఆమె నటిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడా విమర్శలకు అదిరిపోయే సమాధానం చెబుతోంది కాజల్.

ఓ ప్రతిష్టాత్మక రీమేక్ ప్రాజెక్టులో హీరోయిన్ గా ఎంపికైంది కాజల్. కొరియన్ లో సూపర్ హిట్టయిన డాన్సింగ్ క్వీన్ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించాడు సురేష్ బాబు. ఈ సినిమాలో లీడ్ రోల్ కు ఓ స్టార్ హీరోయిన్ అవసరం. ఈ మేరకు కాజల్ తో పాటు శృతిహాసన్, సమంత, పూజా హెగ్డే లాంటి హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. ఫైనల్ గా ఈ పాత్రకు కాజల్ ను ఎంపిక చేశారు.

ఇలా విమర్శకులకు తిరుగులేని సమాధానం ఇచ్చింది కాజల్. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం కాజల్, మంచు విష్ణు సరసన మోసగాళ్లు అనే సినిమా చేస్తోంది. అటు తమిళ్ లో కమల్ తో భారతీయుడు-2 చేస్తోంది. దీంతో పాటు చేతిలో ఓ బాలీవుడ్ సినిమా కూడా ఉంది. ఇప్పుడు డాన్సింగ్ క్వీన్ రీమేక్ ఛాన్స్ కూడా కాజల్ నే వరించింది.

First Published:  12 March 2020 7:00 AM GMT
Next Story