Telugu Global
Cinema & Entertainment

ఆశకైనా హద్దుండాలి కదా "బుజ్జీ"

రాజ్ తరుణ్ తన మార్కెట్ కోల్పోయి చాలా ఏళ్లయింది. గత కొన్నిరోజులుగా అతడి నుంచి మినిమం గ్యారెంటీ సినిమా కూడా రాలేదంటే ఈ హీరో మార్కెట్ ఎంత డౌన్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి హీరో సినిమాకు భారీ రేట్లు చెబితే ఎలా? ప్రస్తుతం ఒరేయ్ బుజ్జిగా సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ జనాలు ఇలానే చెవులు కొరుక్కుంటున్నారు. రాజ్ తరుణ్ హీరోగా ఒరేయ్ బుజ్జిగా అనే సినిమా నిర్మించాడు నిర్మాత రాథామోహన్. మరో 12 వారాల్లో ఈ […]

ఆశకైనా హద్దుండాలి కదా బుజ్జీ
X

రాజ్ తరుణ్ తన మార్కెట్ కోల్పోయి చాలా ఏళ్లయింది. గత కొన్నిరోజులుగా అతడి నుంచి మినిమం గ్యారెంటీ సినిమా కూడా రాలేదంటే ఈ హీరో మార్కెట్ ఎంత డౌన్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి హీరో సినిమాకు భారీ రేట్లు చెబితే ఎలా? ప్రస్తుతం ఒరేయ్ బుజ్జిగా సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ జనాలు ఇలానే చెవులు కొరుక్కుంటున్నారు.

రాజ్ తరుణ్ హీరోగా ఒరేయ్ బుజ్జిగా అనే సినిమా నిర్మించాడు నిర్మాత రాథామోహన్. మరో 12 వారాల్లో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా బిజినెస్ కు సంబంధించి ఇతడు చెబుతున్న రేట్లు విని చాలామంది నవ్వుకుంటున్నారు. మరీ ముఖ్యంగా శాటిలైట్ రైట్స్ విషయంలో టీవీ ఛానెల్స్ కు ఇతడు భారీ రేట్లు చెప్పి భయపెడుతున్నాడు.

ఒరేయ్ బుజ్జిగా సినిమాకు సంబంధించి డిజిటల్, శాటిలైట్ రైట్స్ కింద ఏకంగా 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు రాధామోహన్. రాజ్ తరుణ్ సినిమాలు ఈ రెండు సెగ్మెంట్స్ లో కలుపుకొని రెండున్నర కోట్లకు అమ్ముడుపోవడమే ఎక్కువ. అలాంటిది డబుల్ ఎమౌంట్ చెప్పి అందర్నీ భయపెడుతున్నాడట ఈ నిర్మాత.

First Published:  12 March 2020 2:04 AM GMT
Next Story