Telugu Global
NEWS

ఆల్-ఇంగ్లండ్ క్వార్టర్స్ లో సింధు

తొలిరౌండ్లోనే ముగిసిన సైనా, శ్రీకాంత్ ల పోటీ ప్రపంచ బ్యాడ్మింటన్లోనే అత్యంత ప్రధానమైన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ కు భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు చేరుకోగా…సైనా నెహ్వాల్, కిడాంబీ శ్రీకాంత్ ల పోటీ తొలిరౌండ్లోనే ముగిసింది. యువఆటగాడు లక్ష్యసేన్ తొలిగెలుపుతో ప్రీ-క్వార్టర్స్ చేరినా…రెండోరౌండ్లో పోరాడి ఓడక తప్పలేదు. బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న ఈటోర్నీ మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో అమెరికా ప్లేయర్ బింగ్ ను కంగు తినిపించిన సింధు…ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ లో… కొరియా ప్లేయర్ జీ […]

ఆల్-ఇంగ్లండ్ క్వార్టర్స్ లో సింధు
X
  • తొలిరౌండ్లోనే ముగిసిన సైనా, శ్రీకాంత్ ల పోటీ

ప్రపంచ బ్యాడ్మింటన్లోనే అత్యంత ప్రధానమైన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ కు భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు చేరుకోగా…సైనా నెహ్వాల్, కిడాంబీ శ్రీకాంత్ ల పోటీ తొలిరౌండ్లోనే ముగిసింది. యువఆటగాడు లక్ష్యసేన్ తొలిగెలుపుతో ప్రీ-క్వార్టర్స్ చేరినా…రెండోరౌండ్లో పోరాడి ఓడక తప్పలేదు.

బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న ఈటోర్నీ మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో అమెరికా ప్లేయర్ బింగ్ ను కంగు తినిపించిన సింధు…ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ లో… కొరియా ప్లేయర్ జీ హ్యున్ సుంగ్ ను 21-19, 21-15తో ఓడించింది.

పురుషుల రెండోరౌండ్ పోటీలో భారత యువఆటగాడు లక్ష్యసేన్ …ప్రపంచ మాజీ నంబర్ వన్ విక్టర్ యాక్సిల్ సన్ పై పోరాడి ఓడాడు. 17-21, 18-21 ఓటమితో టోర్నో నుంచి నిష్క్రమించాడు.

అంతకుముందు జరిగిన మహిళల, పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ పోటీలలోనే సైనా నెహ్వాల్, కిడాంబీ శ్రీకాంత్ ల పోరు ముగిసింది. త్వరలో జరిగే టోక్యో ఒలింపిక్స్ అర్హత కోసం తహతహలాడుతున్న ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్ల పరాజయాల పరంపర ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో సైతం కొనసాగింది.

జపాన్ ప్లేయర్ యమగుచి 21-11, 21-8తో వెటరన్ సైనాను, చైనా ప్లేయర్ చెన్ లాంగ్ వరుసగేమ్ లలో.కిడాంబీ శ్రీకాంత్ ను కంగుతినిపించారు.

ప్రపంచ 10వ ర్యాంకర్ సాయి ప్రణీత్, పారుపల్లి కశ్యప్ లు సైతం ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ప్రారంభరౌండ్లలోనే ఇంటిదారి పట్టక తప్పలేదు.

First Published:  12 March 2020 9:45 PM GMT
Next Story