Telugu Global
NEWS

34 ఏళ్ల వయసులో 34వ టైటిల్

పంకజ్ అద్వానీ సరికొత్త చరిత్ర ప్రపంచ చాంపియన్, భారత క్యూస్పోర్ట్ కింగ్ పంకజ్ అద్వానీ తన రికార్డులను తానే అధిగమించుకొంటూ దూసుకు పోతున్నాడు. 34 సంవత్సరాల వయసులో 34వ జాతీయ స్నూకర్ టైటిల్ సాధించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అహ్మదాబాద్ వేదికగా ముగిసిన 2020 జాతీయ స్నూకర్ 6- రెడ్స్ టోర్నీ ఫైనల్లో హాట్ ఫేవరెట్ పంకజ్ అద్వానీ 7-3తో మహారాష్ట్ర్రకు చెందిన ఇష్ ప్రీత్ సింగ్ ను అధిగమించాడు. 34 సంవత్సరాల పంకజ్ అద్వానీ జీవితంలో […]

34 ఏళ్ల వయసులో 34వ టైటిల్
X
  • పంకజ్ అద్వానీ సరికొత్త చరిత్ర

ప్రపంచ చాంపియన్, భారత క్యూస్పోర్ట్ కింగ్ పంకజ్ అద్వానీ తన రికార్డులను తానే అధిగమించుకొంటూ దూసుకు పోతున్నాడు. 34 సంవత్సరాల వయసులో 34వ జాతీయ స్నూకర్ టైటిల్ సాధించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

అహ్మదాబాద్ వేదికగా ముగిసిన 2020 జాతీయ స్నూకర్ 6- రెడ్స్ టోర్నీ ఫైనల్లో హాట్ ఫేవరెట్ పంకజ్ అద్వానీ 7-3తో మహారాష్ట్ర్రకు చెందిన ఇష్ ప్రీత్ సింగ్ ను అధిగమించాడు.

34 సంవత్సరాల పంకజ్ అద్వానీ జీవితంలో ఇది 34వ జాతీయ టైటిల్ కావడం విశేషం. 34వ ఏట 34వ జాతీయ టైటిల్ నెగ్గడం తనకు ఆనందంగా ఉందని పంకజ్ అద్వానీ పొంగిపోతూ చెప్పాడు.

ఇప్పటికే 23సార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన పంకజ్ అద్వానీ 34 సార్లు జాతీయ టోర్నీలు నెగ్గడం ఓ అసాధారణ రికార్డుగా మిగిలిపోతుంది.

మహిళల టైటిల్ సమరంలో అమీకమానీ 4-2 తో విద్యాపిళ్ల్లైని అధిగమించడం ద్వారా భారత చాంపియన్ గా నిలిచింది.

First Published:  12 March 2020 9:30 PM GMT
Next Story