Telugu Global
National

సోనియాతో కోమటిరెడ్డి భేటీ... టీ కాంగ్రెస్ లో అలజడి

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తమ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ కు పీసీసీ చీఫ్ మారిన నేపథ్యంలో.. తెలంగాణకూ మార్పు ఖాయమని ఊహానాలు వినిపిస్తుండగా.. ఈ ఇద్దరి భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. రేవంత్ రెడ్డి అరెస్టు… అందుకు దారి తీసిన పరిణామాలు, ఇతర నేతల పరిస్థితులపై సోనియా ఆరా తీసినట్టు తెలిసింది. అలాగే.. పీసీసీ చీఫ్ గా […]

సోనియాతో కోమటిరెడ్డి భేటీ... టీ కాంగ్రెస్ లో అలజడి
X

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తమ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ కు పీసీసీ చీఫ్ మారిన నేపథ్యంలో.. తెలంగాణకూ మార్పు ఖాయమని ఊహానాలు వినిపిస్తుండగా.. ఈ ఇద్దరి భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. రేవంత్ రెడ్డి అరెస్టు… అందుకు దారి తీసిన పరిణామాలు, ఇతర నేతల పరిస్థితులపై సోనియా ఆరా తీసినట్టు తెలిసింది.

అలాగే.. పీసీసీ చీఫ్ గా తనకు అవకాశం ఇస్తే.. పార్టీలోని నేతలను ఎలా కలుపుకొని పోతానన్న విషయంపై.. సోనియాకు కోమటిరెడ్డి ఓ ప్రణాళిక వివరించినట్టు సమాచారం. ఇదే విషయాన్ని ఆయన విలేకరులను నర్మగర్భంగా చెప్పారు. తనకు అవకాశం ఇస్తే సామాన్య కార్యకర్తగా పార్టీని పటిష్టం చేసేందుకు ప్రయత్నిస్తానని సోనియాకు చెప్పినట్టు తెలిపారు. దాదాపు 20 నిముషాలు ఇరువురి మధ్య చర్చ జరిగిందన్నారు.

ఈ పరిణామంపై.. పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న ఇతర నేతలు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. రేసులో ఉన్న జగ్గారెడ్డితో పాటు.. మరికొందరు నేతలు కోమటిరెడ్డి ఢిల్లీ పర్యటనపై వివరాలు తెలుసుకుంటున్నారు. పదవికి పోటీలో ఉన్న రేవంత్ రెడ్డి జైలుకే పరిమితం కావడం.. ఆయన విషయంలో నేతలు ఎవరూ మాట్లాడకపోవడం.. తమకెందుకు అన్న రీతిలో ఉండడం.. ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా.. ఈ పరిణామాలపై సైలెంట్ గా ఉండడం చూస్తుంటే.. టీ కాంగ్రెస్ లో మొత్తానికి ఏదో జరుగుతోందన్న చర్చ జోరుగా జరుగుతోంది.

కోమటిరెడ్డితో భేటీ తర్వాత సోనియా కూడా ఓ క్లారిటీకి వచ్చి ఉంటారని.. కుదిరితే మూడు నాలుగు రోజుల్లోనే తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ రాక ఖాయమన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.

First Published:  12 March 2020 10:16 PM GMT
Next Story