Telugu Global
Cinema & Entertainment

చిరంజీవికి టాటా చెప్పిన త్రిష

1ఓవైపు ఆచార్య సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు ఇన్ని రోజులైనా త్రిష సెట్స్ పైకి రాలేదు. అప్పుడే అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడా అనుమానాలే నిజమయ్యాయి. ఆచార్య సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు స్వయంగా త్రిష ప్రకటించింది. “అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. కొన్ని సార్లు మనం చేయాలనుకున్నవి సాధ్యం కావు. సృజనాత్మక విభేధాల వల్ల చిరంజీవి సినిమాలో భాగం కాకూడదని నిర్ణయించుకున్నాను. ఆ సినిమా యూనిట్ కు నా శుభాకాంక్షలు. ఇక నా ప్రియమైన […]

చిరంజీవికి టాటా చెప్పిన త్రిష
X

1ఓవైపు ఆచార్య సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు ఇన్ని రోజులైనా త్రిష సెట్స్ పైకి రాలేదు. అప్పుడే అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడా అనుమానాలే నిజమయ్యాయి. ఆచార్య సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు స్వయంగా త్రిష ప్రకటించింది.

“అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. కొన్ని సార్లు మనం చేయాలనుకున్నవి సాధ్యం కావు. సృజనాత్మక విభేధాల వల్ల చిరంజీవి సినిమాలో భాగం కాకూడదని నిర్ణయించుకున్నాను. ఆ సినిమా యూనిట్ కు నా శుభాకాంక్షలు. ఇక నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులారా.. మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్టుతో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను.”

ఇలా ఆచార్య నుంచి తప్పుకున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించింది త్రిష. అయితే లోకానికి ఇప్పుడు తెలిసినా, త్రిష తప్పుకుందనే విషయం యూనిట్ కు ఎప్పుడో తెలుసు. అందుకే వాళ్లు కొన్ని రోజుల కిందట్నుంచే మరో హీరోయిన్ ను వెదికే పనిపెట్టుకున్నారు. ఇందులో భాగంగా మరోసారి కాజల్ తో సంప్రదింపులు ప్రారంభించాడు రామ్ చరణ్.

కాజల్-చరణ్ మంచి ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. కేవలం చరణ్ కోసమే ఖైదీ నంబర్ 150లో నటించడానికి ఒప్పుకుంది కాజల్. ఇప్పుడు కూడా ఆచార్యలో ఆమె నటిస్తే దానికి కారణం రామ్ చరణ్ మాత్రమే. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్టులోకి కాజల్ ను తీసుకోవడం దాదాపు ఖాయం.

First Published:  14 March 2020 4:30 AM GMT
Next Story