Telugu Global
Cinema & Entertainment

ఈ సారైనా హిట్ కొడతాడా?

భారీ అంచనాల మధ్య దర్శకుడిగా మారాడు వక్కంతం వంశీ. అల్లు అర్జున్ తో నా పేరు సూర్య అనే సినిమా చేశాడు. అయితే ఆ అంచనాల్ని ఆ సినిమా అందుకోలేకపోయింది. దర్శకుడిగా వక్కంతం అక్కడే ఆగిపోయాడు. ఇక బన్నీ కెరీర్ కైతే అది భారీ బ్రేకులేసిందనే చెప్పాలి. ఆ మూవీ తర్వాత బన్నీ మరో సినిమా స్టార్ట్ చేయడానికి ఏడాదికి పైగా టైం తీసుకున్నాడు. అలా దర్శకుడిగా డెడ్ బ్లాక్ అయిన వక్కంతం వంశీ ఇప్పుడు కోలుకున్నాడు. […]

ఈ సారైనా హిట్ కొడతాడా?
X

భారీ అంచనాల మధ్య దర్శకుడిగా మారాడు వక్కంతం వంశీ. అల్లు అర్జున్ తో నా పేరు సూర్య అనే సినిమా చేశాడు. అయితే ఆ అంచనాల్ని ఆ సినిమా అందుకోలేకపోయింది. దర్శకుడిగా వక్కంతం అక్కడే ఆగిపోయాడు. ఇక బన్నీ కెరీర్ కైతే అది భారీ బ్రేకులేసిందనే చెప్పాలి. ఆ మూవీ తర్వాత బన్నీ మరో సినిమా స్టార్ట్ చేయడానికి ఏడాదికి పైగా టైం తీసుకున్నాడు.

అలా దర్శకుడిగా డెడ్ బ్లాక్ అయిన వక్కంతం వంశీ ఇప్పుడు కోలుకున్నాడు. మరో కథ రాసుకున్నాడు. దాన్ని రవితేజకు వినిపించాడు. మాస్ రాజా ఓకే చెప్పాడు. సో.. వక్కంతం మరోసారి మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు. మొదటి సినిమాకు సీరియస్ కథను తీసుకున్న ఈ దర్శకుడు.. తన రెండో సినిమాకు మాత్రం ఎంటర్ టైన్ మెంట్ ను నమ్ముకుంటున్నాడు. ఫక్తు మసాలా ఎలిమెంట్స్ తో రవితేజతో సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం స్క్రీన్ ప్లే పూర్తిచేసే పనిలో ఉన్నాడు వక్కంతం. ఉగాదికి మూవీని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో క్రాక్ అనే సినిమాను పూర్తిచేస్తాడు రవితేజ. తన రెండో సినిమాతోనైనా వక్కంతం, దర్శకుడిగా హిట్ కొడతాడేమో చూడాలి. కథకుడిగా సూపర్ హిట్టయిన ఈ వ్యక్తి, దర్శకుడిగా కూడా రాణించాలని కోరుకుందాం.

First Published:  14 March 2020 7:00 AM GMT
Next Story