Telugu Global
NEWS

నంద్యాలలో మ‌ళ్లీ సీట్ ఫైట్ !

నంద్యాల మున్సిప‌ల్ రాజ‌కీయం మ‌ళ్లీ ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ మున్సిప‌ల్ ఛైర్మ‌న్ సీటు ఎవ‌రికి ఇస్తార‌నేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌వి కోసం ఇక్క‌డ పోటాపోటీగా నేత‌లు ట్రై చేస్తున్నారు. దీంతో అధిష్టానం ఎవ‌రి వైపు మొగ్గు చూపుతుంది అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. నంద్యాల మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌వికి వైసీపీ నేత మ‌ల్కిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి భార్య ల‌లిత‌మ్మ నామినేష‌న్ వేశారు. జ‌గ‌న్ కూడా ఛైర్మ‌న్ అభ్య‌ర్థిగా రాజ‌గోపాల్‌రెడ్డి ఫ్యామిలీకి చాన్స్ ఇస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే […]

నంద్యాలలో మ‌ళ్లీ సీట్ ఫైట్ !
X

నంద్యాల మున్సిప‌ల్ రాజ‌కీయం మ‌ళ్లీ ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ మున్సిప‌ల్ ఛైర్మ‌న్ సీటు ఎవ‌రికి ఇస్తార‌నేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌వి కోసం ఇక్క‌డ పోటాపోటీగా నేత‌లు ట్రై చేస్తున్నారు. దీంతో అధిష్టానం ఎవ‌రి వైపు మొగ్గు చూపుతుంది అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

నంద్యాల మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌వికి వైసీపీ నేత మ‌ల్కిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి భార్య ల‌లిత‌మ్మ నామినేష‌న్ వేశారు. జ‌గ‌న్ కూడా ఛైర్మ‌న్ అభ్య‌ర్థిగా రాజ‌గోపాల్‌రెడ్డి ఫ్యామిలీకి చాన్స్ ఇస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే ఇలాంటి టైమ్‌లో ఎమ్మెల్యే శిల్పా ర‌విచంద్రారెడ్డి భార్య నాగినీరెడ్డి నామినేష‌న్ వేయ‌డంతో నంద్యాల రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి.

మ‌ల్కిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దివంగ‌త ఎంపీ ఎస్సీవై రెడ్డి మేన‌ల్లుడు. వైసీపీకి మొద‌టి నుంచి నంద్యాల‌లో పెద్ద దిక్కుగా ఉన్నారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఈయ‌న‌కు ఎమ్మెల్యే సీటు ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే శిల్పా కుటుంబం నుంచి ర‌విచంద్రారెడ్డికి జ‌గ‌న్ టికెట్ ఇవ్వ‌డంతో..ఈయ‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే మండ‌లి ర‌ద్దుతో ఇప్పుడు మున్సిప‌ల్ ఛైర్మ‌న్ చాన్స్ ఇస్తార‌ని వైసీపీ నేత‌లు అంచ‌నా వేశారు. ల‌లిత‌మ్మ నామినేష‌న్ వేయ‌డంతో ఇక ఆమె ఛైర్మ‌న్ అవుతార‌ని అంద‌రూ అనుకుంటున్న టైమ్‌లో ఎమ్మెల్యే భార్య నామినేష‌న్ వేయ‌డం దేనికి సంకేతం అని చ‌ర్చ ఇప్పుడు మొద‌లైంది.

రాజ‌గోపాల్‌రెడ్డి ఇటీవ‌ల పార్టీలో చేరిన జ‌మ్మ‌ల మ‌డుగు నేత రామ‌సుబ్బారెడ్డి వియ్యంకుడు. ఆయ‌న పార్టీలో చేరడం వెనుక ఈయ‌న కృషి కూడా ఉంది. మొద‌టి నుంచి వైసీపీ కండువా మోసిన రాజ‌గోపాల్‌రెడ్డికి మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కుతుందా? లేదా అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాజ‌గోపాల్‌రెడ్డికి ఛైర్మ‌న్ సీటు దూరం చేసేందుకే శిల్పా కుటుంబం ఈ ప్లాన్ వేసిందా? అనే డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. మొత్తానికి నంద్యాల రాజ‌కీయానికి వైసీపీ అధిష్టానం ఎలాంటి ముగింపు చెబుతుందో చూడాలి.

First Published:  14 March 2020 4:06 AM GMT
Next Story