Telugu Global
Cinema & Entertainment

ఈసారి గ్యాప్ తీసుకోను " అనుష్క

బాహుబలి ఎప్పుడొచ్చింది? ఆ తర్వాత అనుష్క ఎన్ని సినిమాలు చేసింది? ఈ రెండు ప్రశ్నలు వేసుకుంటే బొమ్మాలి కెరీర్ లో ఎంత గ్యాప్ వచ్చిందో ఇట్టే చెప్పేయొచ్చు. అయితే ఇకపై అలా గ్యాప్స్ ఇవ్వనంటోంది అనుష్క. కొన్ని అనివార్య కారణాల వల్ల గ్యాప్ వచ్చిందని, ఇకపై ప్రతి ఏడాది కచ్చితంగా తన నుంచి సినిమా వస్తుందని హామీ ఇస్తోంది. ఈ ఏడాది అనుష్క నుంచి నిశ్శబ్దం అనే సినిమా రాబోతోంది. ఈ మూవీ రిలీజైన వెంటనే గౌతమ్ […]

ఈసారి గ్యాప్ తీసుకోను  అనుష్క
X

బాహుబలి ఎప్పుడొచ్చింది?

ఆ తర్వాత అనుష్క ఎన్ని సినిమాలు చేసింది?

ఈ రెండు ప్రశ్నలు వేసుకుంటే బొమ్మాలి కెరీర్ లో ఎంత గ్యాప్ వచ్చిందో ఇట్టే చెప్పేయొచ్చు. అయితే ఇకపై అలా గ్యాప్స్ ఇవ్వనంటోంది అనుష్క. కొన్ని అనివార్య కారణాల వల్ల గ్యాప్ వచ్చిందని, ఇకపై ప్రతి ఏడాది కచ్చితంగా తన నుంచి సినిమా వస్తుందని హామీ ఇస్తోంది.

ఈ ఏడాది అనుష్క నుంచి నిశ్శబ్దం అనే సినిమా రాబోతోంది. ఈ మూవీ రిలీజైన వెంటనే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతోంది అనుష్క. అది కూడా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమానే. ఆ సినిమా కూడా ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి వస్తుంది. అంటే అనుష్క నుంచి ఈ ఏడాది 2 సినిమాలు వస్తాయన్నమాట.

అటు వచ్చే ఏడాది కూడా అనుష్క నుంచి రెండు సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మేరకు దానిపై కూడా స్పందించింది స్వీటీ. మరో రెండు సినిమాలు కథాచర్చల్లో ఉన్నాయని, మ్యాగ్జిమమ్ వాటిని కూడా ఓకే చేస్తానని చెబుతోంది. ఇలా బాహుబలి తర్వాత వచ్చిన గ్యాప్ ను బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో భర్తీ చేయబోతోంది బొమ్మాలి.

First Published:  15 March 2020 2:20 AM GMT
Next Story