Telugu Global
NEWS

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు వాయిదా...

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగిసినా… జ‌డ్పీటీసీ, ఎంపీటీసీతో పాటు మున్సిప‌ల్‌, కార్పొరేష‌న్‌, పంచాయ‌తీ ఎన్నిక‌లు వాయిదా వేస్తున్న‌ట్లు ఎన్నిక‌ల సంఘం అధికారి ర‌మేష్ కుమార్ చెప్పారు. క‌రోనా ప్ర‌భావంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఉండే హక్కులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు కూడా ఉంటాయ‌ని… ఎన్నిక‌ల‌పై క‌రోనా ప్ర‌భావం ఉండే నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ర‌మేష్ చెప్పారు. పంచాయితీ […]

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు వాయిదా...
X

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగిసినా… జ‌డ్పీటీసీ, ఎంపీటీసీతో పాటు మున్సిప‌ల్‌, కార్పొరేష‌న్‌, పంచాయ‌తీ ఎన్నిక‌లు వాయిదా వేస్తున్న‌ట్లు ఎన్నిక‌ల సంఘం అధికారి ర‌మేష్ కుమార్ చెప్పారు. క‌రోనా ప్ర‌భావంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు చెప్పారు.

అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఉండే హక్కులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు కూడా ఉంటాయ‌ని… ఎన్నిక‌ల‌పై క‌రోనా ప్ర‌భావం ఉండే నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ర‌మేష్ చెప్పారు.

పంచాయితీ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది. కానీ ఎన్నిక‌లు వాయిదా వేస్తున్న‌ట్లు ఎన్నికల అధికారి తెలిపారు. విధిలేని పరిస్దితుల్లో ఎన్నికల ప్రక్రియను ఆరువారాలు నిలిపివేస్తున్న‌ట్లు చెప్పారు. ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేయ‌లేద‌ని అన్నారు. ఆరువారాల తరువాత సమీక్ష అనంతరం ఎన్నికలపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు.

ఆరువారాల తరువాత కొత్త‌గా పంచాయితీల షెడ్యూల్ ప్రకటిస్తామ‌ని ఎన్నిక‌ల అధికారి ర‌మేష్ తెలిపారు.
ఇప్పటికే ఏకగ్రీవం అయిన స్థానాల్లో ఎన్నికలు ఉండవని… ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేశామ‌ని అన్నారు.

First Published:  15 March 2020 12:58 AM GMT
Next Story