Telugu Global
National

తమిళ రాజకీయాల్లోకి వడివేలు.. సీఎం కావడమే లక్ష్యమట!

రజినీకాంత్ ఎప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారో తెలియడం లేదు కానీ.. ఆ వ్యవహారం మాత్రం అందరికీ ఓ జోక్ లా మారిపోతోంది. ఆయన.. పార్టీకి అధ్యక్షుడిగా మాత్రమే ఉంటానని.. యువతకే ఎక్కువ శాతం అవకాశం ఇస్తానని చెప్పిన దగ్గర్నుంచి రజినీ పార్టీని ఎగతాళి చేసేవారి సంఖ్య పెరుగుతోంది. సోషల్ మీడియాలోనూ.. ఈ విషయంపై జోకులు పేలుకుతున్నాయి. తాజాగా.. ఈ జాబితాలోకి హాస్య నటుడు వడివేలు చేరారు. తమిళనాడులో ఓ సందర్భంలో ఆయన్ను విలేకరులు కలిశారు. రజినీ […]

తమిళ రాజకీయాల్లోకి వడివేలు.. సీఎం కావడమే లక్ష్యమట!
X

రజినీకాంత్ ఎప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారో తెలియడం లేదు కానీ.. ఆ వ్యవహారం మాత్రం అందరికీ ఓ జోక్ లా మారిపోతోంది. ఆయన.. పార్టీకి అధ్యక్షుడిగా మాత్రమే ఉంటానని.. యువతకే ఎక్కువ శాతం అవకాశం ఇస్తానని చెప్పిన దగ్గర్నుంచి రజినీ పార్టీని ఎగతాళి చేసేవారి సంఖ్య పెరుగుతోంది. సోషల్ మీడియాలోనూ.. ఈ విషయంపై జోకులు పేలుకుతున్నాయి. తాజాగా.. ఈ జాబితాలోకి హాస్య నటుడు వడివేలు చేరారు.

తమిళనాడులో ఓ సందర్భంలో ఆయన్ను విలేకరులు కలిశారు. రజినీ రాజకీయాలపై స్పందించాలని కోరగా.. వడివేలు కాస్త చిత్రంగా రిప్లై ఇచ్చారు. రజినీ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారో ఆయనకే తెలియదు. మీడియాకు తెలియదు.. ఆఖరికి తనకూ తెలియదని చెప్పారు. కానీ.. తాను మాత్రం రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటించి షాకింగ్ న్యూస్ చెప్పారు. 2021లో తాను ముఖ్యమంత్రిని కావాలని కోరుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు.

అక్కడితో ఆగకుండా.. తన పార్టీ జెండా ఇంధ్రధనస్సు అని.. పార్టీ గుర్తు జామకాయ అని చెప్పారు. విలేకరులంతా నవ్వుతూ ఇది నిజమా కాదా అని అయోమయంలో ఉన్న తరుణంలో.. అసలు విషయాన్ని చల్లగా చెప్పారు. తనకు రాజకీయాలంటే పడదని.. ప్రజలను నవ్వించడమే ఇష్టమని… అలాగే ఉంటానని ఈ పులికేశి చెప్పుకొచ్చారు. ఫైనల్ గా.. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని తేల్చేశారు.

First Published:  15 March 2020 1:53 AM GMT
Next Story