Telugu Global
NEWS

చంద్రబాబు నమ్మించి మోసం చేశారు... వెళ్లిపోతున్నా!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరో ఆరోపణ. తనను నమ్మించి వాడుకున్నారని.. ఆ తర్వాత మోసం చేశారని.. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయిన గాదె వెంకటరెడ్డి అంటున్నారు. తన కుమారుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కూడా అయిన గాదె మధుసూదనరెడ్డితో కలిసి టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా, మంత్రిగా చేసిన ఆయన… తర్వాత మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా టీడీపీలోకి వెళ్లారు. ఆయన కుమారుడు కూడా తెలుగుదేశం గూటికి చేరారు. […]

చంద్రబాబు నమ్మించి మోసం చేశారు... వెళ్లిపోతున్నా!
X

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరో ఆరోపణ. తనను నమ్మించి వాడుకున్నారని.. ఆ తర్వాత మోసం చేశారని.. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయిన గాదె వెంకటరెడ్డి అంటున్నారు. తన కుమారుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కూడా అయిన గాదె మధుసూదనరెడ్డితో కలిసి టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా, మంత్రిగా చేసిన ఆయన… తర్వాత మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా టీడీపీలోకి వెళ్లారు. ఆయన కుమారుడు కూడా తెలుగుదేశం గూటికి చేరారు.

కానీ.. చంద్రబాబు రాజకీయ అవసరాలు, సమీకరణాల ముందు తాము తేలిపోయామని గాదె కుటుంబం ఆవేదన చెందింది. 2019 ఎన్నికల్లో తమకు టికెట్ ఇస్తామని చెప్పి చివరి నిముషంలో మొండి చేయి చూపారని ఆవేదన చెందారు. అందుకే.. తాను, తన కుమారుడితో కలిసి పార్టీ నుంచి వెళ్లిపోతున్నామని గాదె వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన మాత్రమే కాదు.. మొదటి నుంచి పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు.

తిరుపతికి చెందిన నేతలు.. డాక్టర్ సుధారాణి, నీలం బాలాజీ.. రాష్ట్ర తెలుగు యువత నాయకుడు అత్తలూరి ఆనంద నాయుడు, మరి కొందరు నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీ పునాదుల నుంచి కష్టపడిన వారిని కీలక సమయాల్లో విస్మరిస్తున్నారంటూ చంద్రబాబు, లోకేష్ నాయకత్వంపై నేతలు అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తపరుస్తున్నారు. అందుకే.. టీడీపీలో ఉండలేమని తేల్చి చెబుతున్నారు.

ఇప్పటివరకూ.. అగ్ర నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిలో ఉన్న ప్రముఖులు టీడీపీ నుంచి బయటికి వెళ్లడం చూశాం. ఇప్పుడు దిగువ శ్రేణి నాయకత్వం కూడా పార్టీని వీడుతోంది. ఈ పరిస్థితి.. తెలుగుదేశానికి మింగుడుపడకుండా ఉంది.

First Published:  16 March 2020 1:05 AM GMT
Next Story