Telugu Global
Cinema & Entertainment

అనిల్ రావిపూడిని అవమానించిన ఆ టీవీ యజమాని ఎవరు?

అనిల్ రావిపూడి తొలిసారిగా డైరెక్ట్ చేసిన సినిమా ‘పటాస్’. కళ్యాణ్ రామ్ హీరోగా తీసిన ఈ సినిమాతోనే రావిపూడి టాలీవుడ్ లోకి డైరెక్టర్ గా ఘనవిజయంతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా తీశాక నిర్మాతలు, పత్రిక విలేకరుల కోసం స్పెషల్ షోలు వేశారట.. అప్పుడు ఓ టీవీ చానెల్ యజమాని వచ్చి ‘ఇది సినిమానేనా.. ఇలాంటి సినిమా కూడా తీస్తారా? చెత్త సినిమా.. ఒక్క రోజు కూడా ఆడదు.. విడుదల చేసి కూడా వేస్ట్’ అంటూ […]

అనిల్ రావిపూడిని అవమానించిన ఆ టీవీ యజమాని ఎవరు?
X

అనిల్ రావిపూడి తొలిసారిగా డైరెక్ట్ చేసిన సినిమా ‘పటాస్’. కళ్యాణ్ రామ్ హీరోగా తీసిన ఈ సినిమాతోనే రావిపూడి టాలీవుడ్ లోకి డైరెక్టర్ గా ఘనవిజయంతో ఎంట్రీ ఇచ్చాడు.

అయితే ఈ సినిమా తీశాక నిర్మాతలు, పత్రిక విలేకరుల కోసం స్పెషల్ షోలు వేశారట.. అప్పుడు ఓ టీవీ చానెల్ యజమాని వచ్చి ‘ఇది సినిమానేనా.. ఇలాంటి సినిమా కూడా తీస్తారా? చెత్త సినిమా.. ఒక్క రోజు కూడా ఆడదు.. విడుదల చేసి కూడా వేస్ట్’ అంటూ తిట్టిపోశాడని అనిల్ రావిపూడి తెలిపాడు. ఆ మాటలకు తనకు భయమేసిందని అనిల్ తెలిపారు.

అయితే ఆ తర్వాత దిల్ రాజు, శిరీష్ ఈ మూవీ చూసి సినిమాను విడుదల చేశారని.. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని అనిల్ రావిపూడి తెలిపారు. సినిమా ఫలితం వచ్చాక ఆ టీవీ చానెల్ ఓనర్ ను బండ బూతులు తిట్టాలనేంత కోపం వచ్చిందని.. అనిల్ తెలిపాడు. వాడు క్రియేటర్ అని బిల్డప్ ఇచ్చాడని.. నువ్వు క్రియేటర్ ఏంట్రా అని ఇష్టమొచ్చినట్టు ఫుట్ బాల్ ఆడుకోవాలని అనిపించిందని అనిల్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం పంచుకున్నాడు.

అయితే ఆ టీవీ చానెల్ ఓనర్ ఎవరనేది మాత్రం అనిల్ చెప్పలేదు. ఈపాటికి ఆ చానెల్ యజమానికి అర్థమైపోయి ఉంటుంది. కానీ ఇలా ఓటములు ఎరుగని, వరుసగా 5 హిట్స్ తీసిన దర్శకుడి సినిమాను మొదట్లో అంత అవమానించిన టీవీ యజమాని ఇప్పుడు తన తప్పు తెలుసుకుంటాడేమో మరీ.

First Published:  17 March 2020 2:42 AM GMT
Next Story