Telugu Global
NEWS

కరోనా వైరస్ ను దీటుగా ఎదుర్కొందాం

అభిమానులకు, ప్రజలకు రోహిత్ శర్మ పిలుపు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దెబ్బతో ఆటలు ఒక్కసారిగా ఆగిపోయాయి. క్రీడా ప్రపంచమే స్తంభించిపోయింది. ఇప్పుడు ప్రముఖ క్రీడాకారులు, క్రికెటర్లు సైతం…. ఆటలు విడిచిపెట్టి కరోనా వైరస్ గురించే మాట్లాడుతున్నారు. చైనాలోని వూహాన్ లో ప్రారంభమై ప్రపంచ వ్యాప్తంగా 6వేలమందిని బలితీసుకొన్న కరోనా వైరస్ బారిన మరో లక్షా 60 వేల మంది పడడంతో…. అగ్రరాజ్యాలు అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్,జపాన్, చైనా లాంటి దేశాలు మాత్రమే కాదు…. అభివృద్ధి పథంలో […]

కరోనా వైరస్ ను దీటుగా ఎదుర్కొందాం
X
  • అభిమానులకు, ప్రజలకు రోహిత్ శర్మ పిలుపు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దెబ్బతో ఆటలు ఒక్కసారిగా ఆగిపోయాయి. క్రీడా ప్రపంచమే స్తంభించిపోయింది. ఇప్పుడు ప్రముఖ క్రీడాకారులు, క్రికెటర్లు సైతం…. ఆటలు విడిచిపెట్టి కరోనా వైరస్ గురించే మాట్లాడుతున్నారు.

చైనాలోని వూహాన్ లో ప్రారంభమై ప్రపంచ వ్యాప్తంగా 6వేలమందిని బలితీసుకొన్న కరోనా వైరస్ బారిన మరో లక్షా 60 వేల మంది పడడంతో…. అగ్రరాజ్యాలు అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్,జపాన్, చైనా లాంటి దేశాలు మాత్రమే కాదు…. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత్ లాంటి వర్థమాన దేశం సైతం…. కరోనా ఎమర్జెన్సీని పాటిస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విమాన సర్వీసులు, విదేశీయులకు వీసాలు మంజూరు చేయడం తాత్కాలికంగా రద్దయ్యాయి.

మనదేశంలోని పలు రాష్ట్ర్రాలు ముందుజాగ్రత్త చర్యగా… పాఠశాలలు, మాల్స్, సినిమాహాళ్లను కొద్దివారాలపాటు మూసి వేస్తున్నట్లు ప్రకటించాయి. అంతేకాదు… భారత్ లోని క్రీడాసంఘాల సమాఖ్య సైతం తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపాయి.

మరోవైపు…కరోనా వైరస్ దెబ్బతో క్రికెట్ ఫీల్డ్ నుంచి ఇంటికే పరిమితమైన విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ లాంటి లక్షలాదిమంది అభిమానులున్న క్రికెటర్లు…ధైర్యాన్ని నూరిపోస్తున్నారు.

కరోనా మహమ్మారిని కలసి కట్టుగా ఎదుర్కొందామని, భయపడాల్సిన అవసరమే లేదని భారత వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ వీడియో సందేశాన్ని అభిమానులతో పంచుకొన్నాడు.

వ్యక్తిగత శుభ్రతతో పాటు…పరిసరాల శుభ్రతకూడా ప్రధానమని, కేంద్ర, రాష్ట్ర్ర ఆరోగ్యమంత్రిత్వశాఖల సలహాలు, సూచనలు పాటిస్తూ…కరోనాను నివారిద్దామని పిలుపునిచ్చాడు.

ఆటలు ముఖ్యంకాదని…జీవితంలో ఆటలు ఓ భాగం మాత్రమేనని…క్రికెట్ కంటే క్రికెట్ ను అభిమానించే కోట్లాదిమంది అభిమానుల ఆరోగ్యమే ముఖ్యమని తన సందేశంలో పేర్కొన్నాడు.

కరోనా వైరస్ ను ఎదుర్కొనడానికి అహరహం శ్రమిస్తున్న వైద్యసిబ్బందికి, శాస్త్రవేత్తలకు రోహిత్ శర్మ హ్యాట్సాఫ్ చెప్పాడు.

First Published:  16 March 2020 8:57 PM GMT
Next Story