Telugu Global
National

భారతదేశంలో మూడో కరోనా మరణం

చైనాలో పుట్టి ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ ధాటికి అంతా బెంబేలెత్తిపోతున్నారు. ఈ వైరస్ భారత్ లోనూ ప్రభావం చూపుతోంది. తాజాగా భారత్ లో మరో వ్యక్తి కరోనా కారణంగా మరణించాడు. కరోనా సోకి ముంబైలోని కస్తూర్బా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోయినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ మరణంతో భారత్ లో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. మొదటి మరణం కర్ణాటకలోని కలబుర్గికి […]

భారతదేశంలో మూడో కరోనా మరణం
X

చైనాలో పుట్టి ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ ధాటికి అంతా బెంబేలెత్తిపోతున్నారు. ఈ వైరస్ భారత్ లోనూ ప్రభావం చూపుతోంది. తాజాగా భారత్ లో మరో వ్యక్తి కరోనా కారణంగా మరణించాడు.

కరోనా సోకి ముంబైలోని కస్తూర్బా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోయినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఈ మరణంతో భారత్ లో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. మొదటి మరణం కర్ణాటకలోని కలబుర్గికి చెందిన ఓ వృద్ఢుడు కాగా.. రెండో మరణం ఢిల్లీకి చెందిన ఓ మహిళా వృద్ధురాలు. ఇప్పుడు మూడో వ్యక్తి కూడా 60 ఏళ్లు పైబడిన వారే కావడం గమనార్హం.

ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 125కు చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 39 కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య 7వేలు దాటింది. మరో లక్షా 80వేల మందికి ఈ వైరస్ సోకడంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

First Published:  17 March 2020 2:18 AM GMT
Next Story