ఆఫీస్ క్లోజ్ చేసిన పూరి జగన్నాధ్

కరోనా ఎఫెక్ట్ తో పూరి కనెక్ట్స్ ఆఫీస్ క్లోజ్ అయింది. ఈ మేరకు దర్శక-నిర్మాత పూరి జగన్నాధ్ నుంచి అఫీషియల్ నోట్ ఒకటి వచ్చింది. తమ సంస్థ నుంచి అడ్మినిస్ట్రేటివ్ వర్క్, ప్రొడక్షన్ వర్క్ ను తాత్కాలికంగా ఆపేస్తున్నట్టు ప్రకటించాడు పూరి. కరోనా కారణంగా కలిసి పనిచేయడం ఆపేశామని, కొన్నాళ్ల పాటు ఆఫీస్ కు తాళాలు వేస్తున్నామంటూ… పూరి జగన్నాధ్, చార్మి పేరిట ఓ లెటర్ బయటకొచ్చింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమా చేస్తున్నాడు పూరి. ముంబయిలో ఈ సినిమాకు సంబంధించి 40 రోజుల భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. హైదరాబాద్ లో త్వరలోనే మరో షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలి. కరోనా ఎఫెక్ట్ తో ఇప్పుడా షెడ్యూల్ డైలమాలో పడింది. తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపై క్లారిటీ లేదు.

దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. సినిమాలో బాక్సర్ గా కనిపించబోతున్నాడు విజయ్ దేవరకొండ. పాన్-ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాను హిందీలో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నాడు.