కరోనా వచ్చినా నా పెళ్లి ఆగదు

టాలీవుడ్ పై కరోనా దెబ్బ గట్టిగా పడింది. ఇప్పటికే థియేటర్లు మూతబడ్డాయి. షూటింగ్స్ ఆగిపోయాయి. అంతేకాదు.. ఈ దెబ్బకు నితిన్ పెళ్లి వేదిక కూడా మారిపోయింది. దుబాయ్ లో జరగాల్సిన పెళ్లి కాస్తా హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. హైదరాబాద్ లో కూడా చెప్పిన తేదీకి పెళ్లి జరుగుతుందా లేదా అనేది ప్రస్తుతానికి అనుమానం. అయితే హీరో నిఖిల్ విషయంలో మాత్రం ఇలాంటి అనుమానాలు అక్కర్లేదు.

రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ పూర్తిచేసుకున్నాడు నిఖిల్. డాక్టర్ పల్లవి వర్మతో నిఖిల్ నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 16న పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. కానీ కరోనా కారణంగా దానిపై డౌట్స్ చెలరేగాయి. అయితే ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని క్లారిటీ ఇచ్చాడు నిఖిల్. చెప్పిన తేదీకి, చెప్పిన ప్లేస్ లో పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశాడు.

సో.. ఏప్రిల్ 16న నిఖిల్ పెళ్లి జరగడం ఖాయమని తేలిపోయింది. అయితే పెళ్లికి పిలిచే బంధువులు, స్నేహితుల సంఖ్య మాత్రం తగ్గే ఛాన్స్ ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఫంక్షన్లు చేయాల్సి వస్తే 200 మందికి మించకుండా చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. ఆ సూచనల ఆధారంగా కాస్త లో-ప్రొఫైల్ లో పెళ్లి చేసుకోవాలని నిఖిల్ భావిస్తున్నాడు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత గ్రాండ్ గా రిసెప్షన్ ఇస్తాడు.