Telugu Global
Cinema & Entertainment

మహేష్ తో వెంకీ కుడుముల

మహేష్ తన కొత్త సినిమా ఎప్పుడు ప్రకటిస్తాడో తెలీదు కానీ, అతడి చుట్టూ చాలామంది దర్శకుల పేర్లు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి వెంకీ కుడుముల కూడా చేరిపోయాడు. భీష్మతో మరో సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడికి మహేష్ నుంచి పిలుపు వచ్చిందట. మంచి కథ ఉంటే చెప్పాలని కోరారట. రీసెంట్ గా మహేష్-వెంకీ మధ్య స్టోరీ డిస్కషన్స్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. లెక్కప్రకారం.. మహేష్-వంశీ పైడిపల్లి కాంబోలో సినిమా రావాలి. కానీ […]

మహేష్ తో వెంకీ కుడుముల
X

మహేష్ తన కొత్త సినిమా ఎప్పుడు ప్రకటిస్తాడో తెలీదు కానీ, అతడి చుట్టూ చాలామంది దర్శకుల పేర్లు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి వెంకీ కుడుముల కూడా చేరిపోయాడు. భీష్మతో మరో సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడికి మహేష్ నుంచి పిలుపు వచ్చిందట. మంచి కథ ఉంటే చెప్పాలని కోరారట. రీసెంట్ గా మహేష్-వెంకీ మధ్య స్టోరీ డిస్కషన్స్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.

లెక్కప్రకారం.. మహేష్-వంశీ పైడిపల్లి కాంబోలో సినిమా రావాలి. కానీ నెరేషన్ నచ్చక మహేష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. తర్వాత సీన్ లోకి పరశురాం ఎంటరయ్యాడు. ఇతడు చెప్పిన కథ మహేష్ కు నచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టు ఓకే అవ్వలేదు. అంతలోనే వెంకీ కుడుముల పేరు తెరపైకి వచ్చింది.

ప్రస్తుతానికైతే మహేష్ బాబు హాలీడే ఎంజాయ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి మరోసారి వెకేషన్ ప్లాన్ చేశాడు. కొత్త సినిమా ప్రకటించడానికి మహేష్ మరింత టైమ్ తీసుకుంటాడని చెబుతున్నారు అతడి సన్నిహితులు. ఒకవేళ మహేష్ గనుక వెంకీ కుడుములకు ఛాన్స్ ఇస్తే, రామ్ చరణ్-వెంకీ కాంబో ఆగిపోయినట్టే.

First Published:  16 March 2020 10:20 PM GMT
Next Story