Telugu Global
NEWS

ఐదుకు చేరిన కరోనా కేసులు " తెలంగాణ‌లో అలర్ట్

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. తాజాగా మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. తెలంగాణ వాసులకు ఒక్కరికి కూడా కరోనా సోకలేదని స్పష్టం చేశారు. విదేశాల నుంచి వ‌చ్చిన వారికి మాత్రమే కరోనా పాజిటివ్ అని తేలింద‌ని చెప్పారు. ఏపీలో ఇప్ప‌టివ‌ర‌కూ ఒకే ఒక పాజిటివ్ కేసు న‌మోదైంది. ఆ బాధితుడు ఆసుప‌త్రిలో కోలుకుంటున్నాడు. శంషాబాద్ విమానాశ్ర‌యంలో ఇప్ప‌టివ‌ర‌కూ 66,162 మంది ప్ర‌యాణికుల‌కు థ‌ర్మ‌ల్ […]

ఐదుకు చేరిన కరోనా కేసులు  తెలంగాణ‌లో అలర్ట్
X

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. తాజాగా మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. తెలంగాణ వాసులకు ఒక్కరికి కూడా కరోనా సోకలేదని స్పష్టం చేశారు. విదేశాల నుంచి వ‌చ్చిన వారికి మాత్రమే కరోనా పాజిటివ్ అని తేలింద‌ని చెప్పారు. ఏపీలో ఇప్ప‌టివ‌ర‌కూ ఒకే ఒక పాజిటివ్ కేసు న‌మోదైంది. ఆ బాధితుడు ఆసుప‌త్రిలో కోలుకుంటున్నాడు.

శంషాబాద్ విమానాశ్ర‌యంలో ఇప్ప‌టివ‌ర‌కూ 66,162 మంది ప్ర‌యాణికుల‌కు థ‌ర్మ‌ల్ స్క్రీన్ చేశారు. క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాలు ఉన్న 4,160 మందికి టెస్ట్‌లు చేస్తే ఐదుగురికి పాజిటివ్ అని తేలింది. చైనా, జ‌ర్మ‌నీ, ఇట‌లీ, ఇరాన్‌, స్పెయిన్ నుంచి వ‌చ్చిన వారిని క్వారంటైల్ సెంట‌ర్‌కు త‌ర‌లిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ వికారాబాద్‌, దూల‌ప‌ల్లిలో 200 మంది క‌రోనా అనుమానితులను ఉంచి చికిత్స అందిస్తున్నారు.

దుబాయ్‌, ఇటలీ, నెద‌ర్లాండ్స్‌, స్కాట్లాండ్, ఇండోనేషియా నుంచి వ‌చ్చిన వారిలో కొందరికి పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఈ దేశాల నుంచి వ‌చ్చే విమానాల‌ను నిలిపివేయ‌నున్నారు. యుఏఈ నుంచి వ‌చ్చే విమానాల‌ను కూడా ఆపేయ‌నున్నారు. హైద‌రాబాద్‌లోని నిమ్స్‌, గాంధీ, ఫీవ‌ర్ ఆసుప‌త్రుల్లో ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఇంత‌కుముందు ప‌రీక్ష‌ల కోసం పుణేకు పంపించాల్సి వ‌చ్చేది. రోగ నిర్ధార‌ణ‌కు టైమ్ ప‌ట్టేది. దీంతో ఇప్పుడు ఇక్క‌డే ఆరు ల్యాబ్‌ల్లో తుది ప‌రీక్ష‌లు నిర్వ‌హించేవిధంగా రెడీ చేశారు.

భార‌త్‌లో క‌రోనా కేసుల సంఖ్య 142కి చేరింది. ముగ్గురు ఈ వ్యాధితో చ‌నిపోయారు. తాజ్‌మ‌హ‌ల్‌, ఊటీతో పాటు షిర్డి, సిద్ది వినాయ‌క ఆల‌యాల‌ను మూసివేశారు.

First Published:  17 March 2020 8:39 PM GMT
Next Story