Telugu Global
National

ధోనీకి ఇక జట్టులో చోటు కష్టమే " వీరేంద్ర సెహ్వాగ్

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తిరిగి జట్టులోకి రావడం కష్టమేనని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. వికెట్ కీపర్, బ్యాట్స్‌ మాన్‌గా జట్టుకు సేవలందించిన ధోనీకి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే పలువురు యువ క్రికెటర్లు ఉన్నారని సెహ్వాగ్ చెప్పాడు. టీం ఇండియాలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ అటు బ్యాటింగ్‌లోనూ ఇటు కీపింగ్‌‌లోనూ రాణిస్తున్న విషయాన్ని సెహ్వాగ్ గుర్తు చేశాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత ఇప్పటి వరకు ధోనీ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ […]

ధోనీకి ఇక జట్టులో చోటు కష్టమే  వీరేంద్ర సెహ్వాగ్
X

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తిరిగి జట్టులోకి రావడం కష్టమేనని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. వికెట్ కీపర్, బ్యాట్స్‌ మాన్‌గా జట్టుకు సేవలందించిన ధోనీకి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే పలువురు యువ క్రికెటర్లు ఉన్నారని సెహ్వాగ్ చెప్పాడు.

టీం ఇండియాలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ అటు బ్యాటింగ్‌లోనూ ఇటు కీపింగ్‌‌లోనూ రాణిస్తున్న విషయాన్ని సెహ్వాగ్ గుర్తు చేశాడు.

వన్డే ప్రపంచకప్ తర్వాత ఇప్పటి వరకు ధోనీ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. బీసీసీఐ అతని క్రికెట్ కాంట్రాక్ట్ కూడా పునరుద్దరించలేదు. పలు మార్లు ధోనీ రిటైర్మెంట్‌ గురించిన వార్తలు వచ్చాయి. కాని ధోనీ వాటిపై ఏనాడూ స్పందించలేదు. అతడు క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు కోచ్ రవిశాస్త్రి కూడా మీడియాకు చెప్పాడు.

కాగా, ఇటీవల మాట మార్చిన శాస్త్రి.. ఐపీఎల్‌లో రాణిస్తే టీ20 ప్రపంచకప్ జట్టులోకి పరిశీలిస్తామని చెప్పాడు. కాగా, ఇప్పుడు ఐపీఎల్ నిర్వహణ సందిగ్దంలో పడటంతో ధోనీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

First Published:  18 March 2020 3:00 AM GMT
Next Story