Telugu Global
NEWS

భారత సంతతి యువతితో మాక్స్ వెల్ నిశ్చితార్థం

భారత విదేశీ అల్లుళ్ల జాబితాలో మరో ఆస్ట్ర్రేలియా క్రికెటర్ ఐపీఎల్ పుణ్యమా అంటూ..భారత్ విదేశీ అల్లుళ్ల జాబితాలో ఆస్ట్ర్రేలియా క్రికెటర్లు ఒక్కక్కరే చేరిపోతున్నారు. ఆస్ట్ర్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్ టెయిట్ గతంలోనే ఓ భారత మహిళలను జీవితభాగస్వామిగా చేసుకొంటే… తాజాగా ఆస్ట్ర్రేలియన్ కమ్ ఐపీఎల్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్.. మరో భారత సంతతి యువతితో.. నిశితార్థం జరుపుకొన్నాడు. ఆస్ట్ర్రేలియన్ క్రికెట్ డాషింగ్ ఆల్ రౌండర్, ఐపీఎల్ లో కింగ్స్ పంజాబ్ కీలక ఆటగాడు గ్లెన్ మాక్స్ […]

భారత సంతతి యువతితో మాక్స్ వెల్ నిశ్చితార్థం
X
  • భారత విదేశీ అల్లుళ్ల జాబితాలో మరో ఆస్ట్ర్రేలియా క్రికెటర్

ఐపీఎల్ పుణ్యమా అంటూ..భారత్ విదేశీ అల్లుళ్ల జాబితాలో ఆస్ట్ర్రేలియా క్రికెటర్లు ఒక్కక్కరే చేరిపోతున్నారు. ఆస్ట్ర్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్ టెయిట్ గతంలోనే ఓ భారత మహిళలను జీవితభాగస్వామిగా చేసుకొంటే… తాజాగా ఆస్ట్ర్రేలియన్ కమ్ ఐపీఎల్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్.. మరో భారత సంతతి యువతితో.. నిశితార్థం జరుపుకొన్నాడు.

ఆస్ట్ర్రేలియన్ క్రికెట్ డాషింగ్ ఆల్ రౌండర్, ఐపీఎల్ లో కింగ్స్ పంజాబ్ కీలక ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్ తో తన నిశ్సితార్థం రెండు కుటుంబాలకు చెందిన సభ్యుల నడుమ భారత సాంప్రదాయం ప్రకారం జరిగినట్లు…భారత సంతతికి చెందిన వినీ రామన్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా బయటపెట్టింది.

గతంలో మరో ఆస్ట్ర్రేలియన్ యువతితో నిశ్చితార్థం జరుపుకొన్న మాక్స్ వెల్…ఫిట్ నెస్ సమస్యలతో పాటు…మానసిక సమస్యలు సైతం ఎదుర్కొన్నాడు.

తాను మానసికంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్న సమయంలో వినీ రామన్ తనకు అండగా నిలిచిందని, చెప్పలేని మానసికస్థైర్యాన్ని ఇచ్చిందని.. అప్పుడే వినీని తన జీవితభాగస్వామిని చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాడు.

భారత సాంప్రదాయ దుస్తుల్లో మాక్స్ వెల్, వినీ కుటుంబసభ్యులు హాజరయ్యారు. త్వరలో తమ వివాహం సైతం భారత సాంప్రదాయపద్ధతిలోనే జరుపుకొంటామని.. వినీ ప్రకటించింది.

మానసిక సమస్యలతో ఆస్ట్ర్రేలియా జట్టుకు దూరమైన 31 సంవత్సరాల మాక్స్ వెల్స్…కొద్ది మాసాల విరామం తర్వాత తిరిగి క్రికెట్ పునరాగమనం చేసి…బిగ్ బాష్ లీగ్ లో మెల్బోర్న్ స్టార్స్ జట్టును రన్నరప్ స్థానంలో నిలిపాడు.

ఎడమ మోచేతి గాయంతో ప్రస్తుతం క్రికెట్ కు దూరమైన మాక్స్ వెల్ శస్త్రచికిత్స నుంచి కోలుకొన్న తర్వాత…2020 ఐపీఎల్ సీజన్ తో పాటు…ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగే టీ-20 ప్రపంచకప్ లో సైతం పాల్గొనాలన్న పట్టుదలతో ఉన్నాడు.

First Published:  19 March 2020 2:12 AM GMT
Next Story