పాగల్ గా మారిన హిట్ హీరో

తనకంటూ కొత్తగా ఓ దారి సృష్టించుకున్నాడు హీరో విశ్వక్ సేన్. ఫలక్ నుమా దాస్ తో పాపులర్ అయిన ఈ నటుడు.. తాజాగా హిట్ సినిమా చేశాడు. ఇప్పుడు పాగల్ అనే మరో సినిమాను ప్రారంభించాడు. ఫలక్ నుమా దాస్, హిట్ సినిమాల టైపులోనే పాగల్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ తో రాబోతోంది.

ఈరోజు రామానాయుడు స్టుడియోస్ లో ఈ సినిమా లాంఛ్ అయింది. ముహూర్తం షాట్ కు రానా క్లాప్ కొట్టగా, దర్శకుడు త్రినాథరావు నక్కిన గౌరవ దర్శకత్వం వహించాడు. ఆనంది ఆర్ట్స్ అధినేత జెమినీ కిరణ్ కెమెరా స్విచాన్ చేయగా.. నిర్మాత దిల్ రాజు స్క్రిప్ట్ అందించారు.

ఈ సినిమాతో నరేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. అర్జున్ రెడ్డి ఫేమ్ రథన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఓవైపు కరోనా దెబ్బతో స్టార్స్ అంతా ఇళ్లకే పరిమితమైపోగా, ఇండస్ట్రీ మొత్తం బోసిపోయిన వేళ.. విశ్వక్ సేన్ ఒక్కడు ఇలా మూవీ లాంఛ్ తో కాస్త హంగామా చేశాడు.