Telugu Global
National

ఆదివారం జనతా కర్ఫ్యూ " ప్రధాని మోదీ పిలుపు

రోజురోజుకు పెరుగుతున్న కరోనాపై ప్రధాని మోదీ యుద్ధం ప్రకటించారు. ప్రజల్లో అప్రమత్తత, ఆలోచన వచ్చే విధంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. ప్రజల కోసం ప్రజల ద్వారా ప్రజలే విధించుకునే కర్ఫ్యూ అని ఆయన అన్నారు. అత్యవసరం అయితే తప్ప.. ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోంచి బయటకు రావొద్దని కోరారు. కరోనా మహమ్మారి ముప్పు […]

ఆదివారం జనతా కర్ఫ్యూ  ప్రధాని మోదీ పిలుపు
X

రోజురోజుకు పెరుగుతున్న కరోనాపై ప్రధాని మోదీ యుద్ధం ప్రకటించారు. ప్రజల్లో అప్రమత్తత, ఆలోచన వచ్చే విధంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. ప్రజల కోసం ప్రజల ద్వారా ప్రజలే విధించుకునే కర్ఫ్యూ అని ఆయన అన్నారు. అత్యవసరం అయితే తప్ప.. ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోంచి బయటకు రావొద్దని కోరారు.

కరోనా మహమ్మారి ముప్పు భారత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని ప్రధాని అన్నారు. ప్రజల అప్రమత్తతే ఆ వైరస్‌ బారి నుండి దేశాన్ని రక్షిస్తుందని చెప్పారు. శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారని, ఇప్పటిదాకా ఈ మహమ్మారికి మందు కనుగొనలేకపోయారని మోడీ వివరించారు.

ఆదివారం సాయంత్రం ఐదుగంటలకు స్థానిక సంస్థలు సైరన్‌ మోగించాలని…ఈ టైమ్‌లో ప్రజలు అందరూ తమ ఇళ్లలో కిటికీలు, డోర్ల దగ్గరకు వచ్చి చప్పట్లు కొట్టి కరోనాపై పోరాడుతున్నవారికి సంఘీభావం తెలపాలని ప్రధాని మోదీ సూచించారు.

ఇదే టైమ్‌లో కరోనా ప్రభావం దేశ ఆర్ధికవ్యవస్థపై చూపే ప్రభావాన్ని అంచనావేయడానికి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వచ్చే కొన్ని వారాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు.

First Published:  19 March 2020 8:33 PM GMT
Next Story