ఎంపీ దుష్యంత్‌కు కరోనా…. పార్లమెంట్‌లో కలవరం

పార్లమెంటులో కరోనా కలకలం. దేశమంతా ఎంత జాగ్రత్తగా ఉండాలో అని ఓ వైపు చర్చించుకుంటున్న తరుణంలో.. ఎంపీల్లోనే ఒకరికి కరోనా సోకడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని తేలింది. కొన్ని రోజులుగా లండన్‌లో ఉన్న కనికా మార్చి 15న లక్నోకు వచ్చింది. లక్నో చేరుకున్న తర్వాత కనికా తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో గ్రాండ్‌గా పార్టీ ఇచ్చింది. దానికి చాలా మంది రాజకీయ నాయకులతో పాటు సామాజిక వేత్తలు కూడా హాజరైనట్లు తెలుస్తుంది. ఆ తర్వాత లక్నోలోని ఓ పెద్ద అపార్ట్‌మెంట్‌లో వాళ్లున్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించగా ఆ పార్టీకి వచ్చిన నలుగురికి కరోనా పాజిటివ్‌ తేలినట్లు అధికారులు వెల్లడించారు. అందులో గాయని కనికా ఒకరు. ప్రస్తుతం లక్నోలోని కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేర్చి వైద్యసేవలు అందిస్తున్నారు. లండన్‌ నుంచి తిరిగొచ్చిన తర్వాత కనికా తన ప్రయాణం గురించి ఎవరికీ చెప్పలేదు. ఆమె పార్టీలో పాలుపంచుకోవడం కోసం ఇంగ్లండ్‌ ప్రయాణాన్ని దాచిపెట్టినట్లు తెలుస్తోంది.

ఇక ఎంపీ దుష్యంత్‌ సింగ్‌ లక్నోలో జరిగిన పార్టీకి హాజరయ్యారు. కనికాతో షేక్‌హ్యాండ్‌ ఇచ్చినట్లు కూడా అధికారులకు చెప్పడంతో.. ఆయనను హోమ్‌ క్వారంటైన్‌ చేశారు. ఢిల్లీలోని స్వగృహంలో ఉంచారు. రెండు వారాల పాటు ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉండనున్నారు.

మరోవైపు ఆయన తల్లి.. రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధర రాజే కూడా ఇంటికే పరిమితం అయ్యారు. అయితే పార్టీకి వెళ్లి వచ్చిన తర్వాత పార్లమెంట్‌ కు కూడా దుష్యంత్‌ హాజరయ్యారు. దీంతో ఆ రోజు ఆయనతో మాట్లాడిన వారిని, ఇతరులను ఇంటికే పరిమితం చేసేలా ప్రభుత్వం చూస్తోంది.