Telugu Global
NEWS

తెలుగురాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కోరలు చాస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల విస్తృతంగా వ్యాపిస్తోంది. తెలంగాణలోని కరీంనగర్ లో పర్యటించిన ఇండోనేషియన్ల వల్ల ఇప్పటికే పలువురికి కరోనా సోకి ఆసుపత్రుల్లో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారిపై తెలుగు రాష్ట్రాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో కరోనా విజృంభించింది. ఇప్పటికే నలుగురు మృత్యువాత పడగా.. తాజాగా జైపూర్ లో ఇటాలియన్ కరోనాతో చనిపోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల […]

తెలుగురాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు
X

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కోరలు చాస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల విస్తృతంగా వ్యాపిస్తోంది. తెలంగాణలోని కరీంనగర్ లో పర్యటించిన ఇండోనేషియన్ల వల్ల ఇప్పటికే పలువురికి కరోనా సోకి ఆసుపత్రుల్లో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారిపై తెలుగు రాష్ట్రాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో కరోనా విజృంభించింది. ఇప్పటికే నలుగురు మృత్యువాత పడగా.. తాజాగా జైపూర్ లో ఇటాలియన్ కరోనాతో చనిపోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య ఐదుకు చేరింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 200కు చేరువ అవుతోంది. ప్రధాని మోడీ… ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని తాజాగా పిలుపునిచ్చాడు. ఇక కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో తీవ్రత ఎక్కువగా ఉంది.

తాజాగా తెలంగాణలో మరో 3 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 16కు చేరింది. ఇక ఏపీలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖలో ఓ వ్యక్తికి కరోనా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇటీవలే మక్కాకు వెళ్లి వచ్చిన 65 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్ అని తెలియడంతో చెస్ట్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నారు.

First Published:  20 March 2020 4:30 AM GMT
Next Story