మరో మెరుపు పాత్రలో హెబ్బా

ఎప్పుడో 30 దాటేసింది హెబ్బా. ఆమెకిప్పుడు స్టార్ హీరోల సరసన పాత్రలు రావడం కష్టం. కుర్రహీరోల సరసన నటిద్దామంటే ఏజ్ బార్ అయిపోయింది. దీంతో ప్రత్యేక పాత్రలు, గీతాలకే పరిమితమైపోయింది ఈ బ్యూటీ. ఇందులో భాగంగా రెడ్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది హెబ్బా పటేల్.

తమిళ్ లో సూపర్ హిట్టయిన తడమ్ సినిమాకు రీమేక్ గా వస్తోంది రెడ్. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు హీరో రామ్. ఈ రెండు పాత్రల్లో ఒక పాత్ర ఇంట్రడక్షన్ కోసం హెబ్బా పటేల్ తో ఐటెంసాంగ్ పెట్టినట్టు తెలుస్తోంది. మణిశర్మ కంపోజ్ చేసిన ఆ పాట టోటల్ సినిమాకే హైలైట్ అవుతుందంటున్నారు.

ఇప్పటికే భీష్మ సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించింది హెబ్బా పటేల్. సినిమా స్టార్టింగ్ లో, ఎండింగ్ లో ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది. రిలీజ్ కు రెడీ అయిన ఒరేయ్ బుజ్జిగా సినిమాలో కూడా గెస్ట్ రోల్ చేసింది. ఇప్పుడు రెడ్ సినిమాలో ఐటెంసాంగ్ కూడా చేస్తోంది. సో.. హెబ్బా ఇప్పుడు స్పెషల్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అయిందన్నమాట.