నిర్భయ కేసు : గ్యాంగ్ రేప్ నుంచి ఉరికంబం వరకు…

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు తీహార్ జైలు నెంబర్ 3లో ఉరి శిక్షను అమలు చేశారు. కాగా, ఈ పాశవిక ఘటన జరిగిన దగ్గర నుంచి ఉరి శిక్ష అమలు అయ్యే వరకు ఎన్నో మలుపులు తిరిగింది. అవేంటో తేదీల ప్రకారం చూద్దాం…

16 డిసెంబర్ 2012 – ఢిల్లీలో ఒక పారామెడికల్ విద్యార్థినిపై ఆరుగురు కలిసి కదులుతున్న బస్సులో అత్యంత పాశవికంగా గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం ఆమెను, ఆమె స్నేహితుడిని బస్సులోంచి తోసేశారు. వీరిని ఢిల్లీలోని సర్థఫ్‌గంజ్ ఆసుపత్రిలో చేర్చించారు.

  • డిసెంబర్ 29 – పూర్తి అపస్మారక స్థితిలో ఉన్న నిర్భయ సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్‌లో మర్డర్ చార్జెస్ అదనంగా చేర్చారు.
  • 2 జనవరి 2013 – అప్పటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి అల్తమాస్ కబీర్ లైంగిక దాడుల కేసులకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు.
  • ఆగస్టు 31 – జువేలియన్ జస్టీస్ బోర్డు నిందితుల్లోని మైనర్‌ను దోషిగా తేల్చి మూడేండ్లు ప్రొబేషన్ హోమ్‌లో ఉండాలని తీర్పు చెప్పింది.
  • సెప్టెంబర్ 10 – ఈ కేసులో నిందితులైన ముఖేష్, వినయ్, అక్షయ్, పవన్‌లను దోషులుగా నిర్థారిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు చెప్పింది.
  • సెప్టెంబర్ 13 – ఢిల్లీ కోర్టు వీరందరికీ ఉరి శిక్షను విధించింది.
  • 13 మార్చి 2014 – కింది కోర్టు ఇచ్చిన మరణ శిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది.
  • మార్చి 15 – సుప్రీంకోర్టు తొలుత ఇద్దరు దోషులకు, తర్వాత మిగిలిన ఇద్దరు దోషులకు విధించిన శిక్షపై స్టే విధించింది.
  • 3 ఫిబ్రవరి 2017 – ఈ కేసులో మళ్లీ మొదటి నుంచి వాదనలు వింటామని సుప్రీంకోర్టు చెప్పింది.
  • మే 5 : సుప్రీంకోర్టు నలుగురు దోషులకు మరణ శిక్షను ఖరారు చేసింది. ఇది చాలా అరుదైన కేసని వ్యాఖ్యానించింది.
  • నవంబర్ 8 – నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్ తనకు విధించిన మరణ శిక్షపై రివ్యూ పిటిషన్‌ను సుప్రీంలో దాఖలు చేశాడు.
  • డిసెంబర్ 15 – మరో ఇద్దరు దోషులు వినయ్ శర్మ, పవన్ కుమార్ గుప్తాలు కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు
  • జులై 9 – సుప్రీంకోర్టు ముగ్గురి రివ్యూ పిటిషన్లను కొట్టేసింది.
  • ఫిబ్రవరి 2019 – దోషులకు వెంటనే డెత్ వారెంట్లు జారీ చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు
  • 10 డిసెంబర్ 2019 – తన మరణ శిక్షపై అక్షయ్ కుమార్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు.
  • డిసెంబర్ 18 – అక్షయ్ రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దోషులు తమకు మిగిలి ఉన్న అన్ని న్యాయపరమైన హక్కులను ఉపయోగించుకోమని చెప్పమని తీహార్ జైలు అధికారులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది.
  • డిసెంబర్ 19 – నేరం జరిగిన సమయంలో తాను మైనర్‌ని అని శిక్షను తగ్గించాలని పవన్ కుమార్ గుప్తా ఢిల్లీ హైకోర్టులో పెట్టుకున్న పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.
  • 6 జనవరి 2020 – పవన్ కుమార్ గుప్తా తండ్రి ఢిల్లీ కోర్టులో వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది
  • జనవరి 7 – ఢిల్లీలోని పటియాలా కోర్టు నలుగురు దోషులను జనవరి 22న ఉదయం 7 గంటలకు తీహార్ జైలులో ఉరి తీయాలని డెత్ వారెంట్ జారీ చేసింది.
  • జనవరి 14 – సుప్రీంకోర్టు వినయ్, ముఖేష్‌ల క్యూరేటీవ్ పిటిషన్‌ను తిరస్కరించింది.
  • ముఖేష్ రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేశాడు
  • జనవరి 17 – ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింగ్ తిరస్కరించారు.
  • తీహార్ జైలు అధికారులు తాజాగా మరో తేదీని ఉరి శిక్ష కోసం కోరగా.. ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 1న ఉదయం గంటలకు సమయం ఇచ్చింది.
  • జనవరి 25 – తన క్షమాభిక్ష తిరస్కరణపై ముఖేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
  • జనవరి 29 – అక్షయ్ సుప్రీంకోర్టులో క్యూరేటీవ్ పిటిషన్ దాఖలు చేశాడు.
  • క్షమాభిక్ష తిరస్కరణపై ముఖేష్ వేసిన సవాలును సుప్రీంకోర్టు కొట్టేసింది.
  • జనవరి 30 – అక్షయ్ క్యూరేటీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
  • జనవరి 31 – తాను మైనర్‌ని అని పవన్ వేసిన పిటిషన్ తిరస్కరణ సమీక్షించమని సుప్రీంని ఆశ్రయించగా.. కోర్టు పిటిషన్ కొట్టేసింది.
  • ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్లను మళ్లీ వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పాత వారెంట్లను రద్దు చేసింది.
  • ఫిబ్రవరి 5 – నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీయాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తిరస్కరించాలని.. విడివిడిగా ఉరికి అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దోషులు తమ న్యాయపరమైన అన్ని హక్కులను ఒక వారంలోపు వినియోగించుకోవాలని ఆదేశించింది.
  • హైకోర్టు తీర్పుపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
  • ఫిబ్రవరి 6 – తీహార్ జైలు అధికారులు కొత్త డెత్ వారెంట్లు జారీ చేయాలని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు.
  • ఫిబ్రవరి 7 – తీహార్ జైలు అధికారుల విన్నపాన్ని ట్రయల్ కోర్టు తిరస్కరించింది.
  • ఫిబ్రవరి 11 – తన క్షమాభిక్ష తిరస్కరణను సవాలు చేస్తూ వినయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు.
  • కొత్త డెత్ వారెంట్లు జారీ చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.
  • ఫిబ్రవరి 13 – పవన్ డీఎల్ఎస్ఏ నుంచి లాయర్ సహాయాన్ని తిరస్కరించాడు. దీంతో సుప్రీంకోర్టు అంజనా ప్రకాష్‌ను ఎమికస్‌గా నియమించింది.
  • తనకు మానసిక స్థితి సరిగా లేదని వినయ్ సుప్రీంలో పిటిషన్ వేయగా.. కేంద్రం అతడి ఆరోగ్యం బాగానే ఉందని వాదించింది.
  • ఫిబ్రవరి 14 – వినయ్ కుమార్ క్షమాభిక్ష తిరస్కరణ సవాలు పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది
  • ఫిబ్రవరి 17 – న్యాయవాది వృందా గ్రోవర్ తన తరపున ముఖేస్ తిరస్కరించాడు
  • ఢిల్లీ కోర్టు తాజాగా మార్చి 3న శిక్ష అమలు చేయాలని డెత్ వారెంట్లు జారీ చేసింది.
  • ఫిబ్రవరి 28 – పవన్ కుమార్ గుప్తా సుప్రీంకోర్టులో క్యూరేటీవ్ పిటిషన్ దాఖలు చేశాడు
  • మార్చి 2 – పవన్ క్యూరేటీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అతడు క్షమాభిక్షకు పిటిషన్ దాఖలు చేశాడు
  • తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నలుగురు దోషుల ఉరి శిక్షను అమలును ఢిల్లీ కోర్టు నిలిపేసింది.
  • మార్చి 4 – దోషుల ఉరి శిక్ష అమలుకు తాజాగా కొత్త తేదీని ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
  • మార్చి 5 – దోషులకు మార్చి 20న ఉరి శిక్ష అమలు చేయాలని ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది.
  • మార్చి 6 – తన న్యాయపరమైన హక్కులను తిరిగి ఉపయోగించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ముఖేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
  • మార్చి 11 – తనపై అనుచితంగా ప్రవర్తించినందుకు పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పవన్ కోర్టును ఆశ్రయించగా తిరస్కరణకు గురైంది.
  • మార్చి 12 – పవన్ పిటిషన్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ అతని తండ్రి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
  • మార్చి 13 – తన క్షమాభిక్ష తిరస్కరణలో సరైన విధానాలు పాటించలేదని వినయ్ హైకోర్టును ఆశ్రయించాడు.
  • మార్చి 16 – తన న్యాయ హక్కుల పునరుద్దరణ కోసం ముఖేష్ వేసిన పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించింది.
  • ముగ్గురు దోషులు మరణ శిక్షపై స్టే విధించాలని అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించారు.
  • మార్చి 17 – నేరం జరిగిన సమయంలో తాను ఢిల్లీలో లేనని ముఖేష్ ఖ్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు కొట్టేసింది. పవన్ సుప్రీంకోర్టులో క్యూరేటీవ్ పిటిషన్ వేయగా.. అక్షయ్ రెండో సారి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు.
  • మార్చి 18 – ట్రయల్ కోర్టు ఆదేశాలపై ముఖేష్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు డిస్ మిస్ చేసింది. పవన్, వినయ్, అక్షయ్ మరణ శిక్షపై స్టే విధించాలని కోర్టును ఆశ్రయించారు.
  • మార్చి 19 – పవన్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. తను అప్పుడు ఢిల్లీలో లేనని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
  • ఢిల్లీ కోర్టు పవన్, వినయ్, అక్షయ్‌ల స్టే పిటిషన్ కొట్టేసింది.
  • రెండో క్షమాభిక్ష తిరస్కరణపై అక్షయ్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది
  • మార్చి 20 (తెల్లవారుజామున) – దోషులు మరణశిక్షపై స్టే విధించమని పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
  • దోషుల అన్ని రకాల పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో వారిని ఇవాళ ఉదయం 5.30 గంటలకు ఉరి తీశారు.