ఆచార్యలో మరో హీరోయిన్

ఆచార్య ప్రాజెక్ట్ నుంచి త్రిష తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలామంది హీరోయిన్లను ప్రయత్నించి ఎట్టకేలకు మరోసారి కాజల్ కే ఫిక్స్ అయ్యారు మేకర్స్. అయితే ఇప్పుడీ సినిమాకు మరో హీరోయిన్ కూడా కావాలి. ఆమె ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికైతే కియరా అద్వానీ, రష్మిక పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఆచార్యలో 10 నిమిషాల ఫిమేల్ క్యారెక్టర్ ఉంది. ఈ పాత్రను ఎవరైనా స్టార్ హీరోయిన్ పోషిస్తే బాగుంటుంది. అందుకే కియరా, రష్మికలో ఒకర్ని తీసుకోవాలనేది ఆలోచన. ఇందులో కియరా పేరును చరణ్ ప్రతిపాదిస్తే, రష్మిక పేరును చిరంజీవి ప్రతిపాదించారు. సో.. ఆటోమేటిగ్గా అందరూ రష్మిక వైపు మొగ్గుచూపారు.

అంతా బాగానే ఉంది కానీ జస్ట్ 10 నిమిషాల నిడివి గల ఈ పాత్రను చేసేందుకు రష్మిక ఒప్పుకుంటుందా అనేది చూడాలి. అయితే చిరంజీవి రంగంలోకి దిగితే అదేమంత పెద్ద సమస్య కాదు. చిరంజీవిని తన లక్కీ ఛార్మ్ గా చెప్పుకొచ్చింది రష్మిక. తన సినిమా ఫంక్షన్ కు చిరంజీవి వస్తే ఆ మూవీ పెద్ద హిట్టవుతుందనే సెంటిమెంట్ ను బయటకు తీసింది. కాబట్టి చిరంజీవి కోరితే ఆ చిన్న పాత్ర చేసేందుకు రష్మిక ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవచ్చు.