Telugu Global
NEWS

జనతా కర్ఫ్యూకు క్రీడాప్రముఖుల జై

కరోనాను అధిగమించాలంటే మోడీ మాటవినాల్సిందే కొహ్లీ, రవిశాస్త్రి, అశ్విన్, ధావన్, హర్భజన్ కోరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను దీటుగా ఎదుర్కొనాలంటే ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన జనతా కర్ఫ్యూను… ప్రతి ఒక్కరు ఈనెల 22న విధిగా పాటించితీరాల్సిందేనని భారత క్రీడాదిగ్గజాలు పిలుపునిచ్చారు. చైనాలో ప్రారంభమై… ప్రపంచ దేశాలకు విస్తరించి..ఇప్పటికే 9వేలమందిని బలితీసుకొని, మరో రెండులక్షల మందికి సోకిన కరోనా వైరస్ కమ్ కోవిడ్ 19 ముప్పు నుంచి బయటపడాలంటే…మార్చి 22 ఉదయం 7 గంటల నుంచి రాత్రి […]

జనతా కర్ఫ్యూకు క్రీడాప్రముఖుల జై
X
  • కరోనాను అధిగమించాలంటే మోడీ మాటవినాల్సిందే
  • కొహ్లీ, రవిశాస్త్రి, అశ్విన్, ధావన్, హర్భజన్ కోరస్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను దీటుగా ఎదుర్కొనాలంటే ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన జనతా కర్ఫ్యూను… ప్రతి ఒక్కరు ఈనెల 22న విధిగా పాటించితీరాల్సిందేనని భారత క్రీడాదిగ్గజాలు పిలుపునిచ్చారు.

చైనాలో ప్రారంభమై… ప్రపంచ దేశాలకు విస్తరించి..ఇప్పటికే 9వేలమందిని బలితీసుకొని, మరో రెండులక్షల మందికి సోకిన కరోనా వైరస్ కమ్ కోవిడ్ 19 ముప్పు నుంచి బయటపడాలంటే…మార్చి 22 ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ దేశంలోని ప్రతిఒక్కరూ ఇంటిపట్టునే ఉండి జనతా కర్ఫ్యూను పాటించి తీరాలంటూ భారత ప్రధాని పిలునిచ్చారు.

వైద్యసేవలు అందించేవారు, ఇతర అత్యవసర సర్వీసులకు చెందినవారు మాత్రమే తగిన జాగ్రత్తలతో తమ విధులకు హాజరుకావాలని కోరారు.

జనతా కర్ఫ్యూకు కొహ్లీ మద్దతు…

జనతా కర్ఫ్యూ పాటించాలంటూ ప్రధాని మోడీ దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వెంటనే…భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.

దేశప్రజల హితం కోరి ప్రధాని పిలుపునిచ్చారని, ఈనెల 22న అందరమూ జనతా కర్ఫ్యూను పాటించడం ద్వారా కరోనా వైరస్ నివారణకు కలసికట్టుగా కృషి చేసినట్లవుతుందని చెప్పాడు. బాధ్యతగల భారత పౌరులుగా ప్రధాని సూచనలు పాటిద్దామని పిలుపునిచ్చాడు.

కరోనా వైరస్ వ్యాపికి అడ్డుకట్ట వేయటానికి నిరంతరం పాటుపడుతున్న లక్షలాదిమంది వైద్యసిబ్బందికి విరాట్ కొహ్లీ హ్యాట్సాఫ్ చెప్పాడు. ప్రపంచ వ్యాప్తంగా…. కరోనాతో పోరాడుతున్న కోట్లాదిమంది సిబ్బందికి రుణపడి ఉంటామని అన్నాడు. అందరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని, కరోనా వైరస్ కు మందు ఏదీలేదని, వ్యక్తిగత శుభ్రత, ముందుజాగ్రత్త చర్యలే తగిన మందు అని తెలిపాడు.

ప్రధాని మాట విందాం- రవిశాస్త్రి

దేశంలోని కోట్లాదిమంది ప్రజల మేలుకోరి ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాటల్ని ప్రతిఒక్కరు వినటమే కాదు…చిత్తశుద్ధితో ఆచరించాలని భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడు రవి శాస్త్రి కోరాడు. ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం ప్రధాని సూచనలను పాటిద్దామంటూ తమతమే సందేశాల ద్వారా పేర్కొన్నారు.

నమ్మకమున్నా లేకున్నా- అశ్విన్

130కోట్లకు పైగా జనాభాతో …ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ లో…కరోనా వైరస్ మహమ్మారిని అధిగమించాలంటే..ప్రతిఒక్కరూ క్రమశిక్షణ పాటించాల్సిందేనని, నమ్మకం ఉన్నా లేకున్నా…మార్చి 22న జనతా కర్ఫ్యూ పాటించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును గౌరవించిన వారమవుతామని స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ తన ట్విట్టర్ సందేశం ద్వారా విజ్ఞప్తి చేశాడు.

కుస్తీ వస్తాదులు యోగేశ్వర్ దత్, సాక్షిమాలిక్, వినేశ్ పోగట్, బబిత పోగట్, భారత హాకీ మహిళా కెప్టెన్ రాణి రాంపాల్ సైతం…మోడీ పిలుపునకు తాము కట్టుబడి ఉన్నామని…మార్చి 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఇంటిపట్టునే ఉండాలని గట్టిగా నిర్ణయించుకొన్నామని ప్రకటించారు.

ఒక విధంగా చెప్పాలంటే…మార్చి 22న భారతజాతి 14 గంటలపాటు స్వయం క్వారెంటైన్ పాటిస్తున్నట్లుగానే భావించాలి మరి.

First Published:  19 March 2020 9:07 PM GMT
Next Story