కాల్షీట్లు కేటాయించిన శృతిహాసన్

పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారనే సంగతి తెలిసిందే. కాటమరాయుడు తర్వాత ఇలా మరోసారి వకీల్ సాబ్ రూపంలో పవన్-శృతి కలుస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ, కాల్షీట్ల విషయంలోనే మరోసారి ఈ కాంబినేషన్ అనుమానంలో పడింది.

ప్రస్తుతం శృతిహాసన్ చాలా బిజీగా ఉంది. ఇంత బిజీ టైమ్ లో కూడా దిల్ రాజు అడిగాడు కాబట్టి ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. ఏప్రిల్ రెండో వారం నుంచి వకీల్ సాబ్ కు కాల్షీట్లు కేటాయించింది. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది.

శృతిహాసన్ కాల్షీట్లైతే ఇచ్చేసింది కానీ, ఆ టైమ్ కు పవన్ ను లొకేషన్ కు తీసుకురావడం ఎలా అని యూనిట్ ఆలోచిస్తోంది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో షూటింగ్స్ అన్నీ ఆపేశారు. ఏప్రిల్ రెండో వారానికి పరిస్థితి మెరుగవుతుందో… అవ్వదో… చెప్పలేని పరిస్థితి. ఒకవేళ కరోనా ప్రభావం తగ్గి, పరిస్థితి మెరుగైనా ఆ టైమ్ కు పవన్ కాల్షీట్లు దొరుకుతాయో… దొరకవో… అనేది మరో సమస్య. దీంతో దిల్ రాజు తెగ సతమతమౌతున్నాడు.

కేవలం ఈ కాల్షీట్ల సమస్య కారణంగానే శృతిహాసన్ ఎంట్రీని అధికారికంగా ప్రకటించలేదు దిల్ రాజు. పవన్ కాల్షీట్లపై క్లారిటీ వచ్చి, కరోనా ప్రభావం తగ్గిన వెంటనే శృతిహాసన్ ఎంట్రీని అఫీషియల్ గా ప్రకటిస్తారు.