Telugu Global
NEWS

ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర... భగ్నం చేసిన పోలీసులు

ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి హత్యకు కొందరు కుట్న పన్నారు. ఈ కుట్రను కడప జిల్లా చిన్న చౌక్‌ పోలీసులు భగ్నం చేశారు. ఏవి సుబ్బారెడ్డిని హత మార్చేందుకు 50 లక్షలకు ముగ్గురు వ్యక్తులు డీల్ కుదుర్చుకున్నారు. నిందితులు ముగ్గురు కర్నూలు జిల్లాకు చెందిన వారే. కడపలో హత్యకు ప్రణాళిక రూపొందిస్తున్న సమయంలో చాకచక్యంగా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 3.20 లక్షల రూపాయల నగదు, […]

ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర... భగ్నం చేసిన పోలీసులు
X

ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి హత్యకు కొందరు కుట్న పన్నారు. ఈ కుట్రను కడప జిల్లా చిన్న చౌక్‌ పోలీసులు భగ్నం చేశారు. ఏవి సుబ్బారెడ్డిని హత మార్చేందుకు 50 లక్షలకు ముగ్గురు వ్యక్తులు డీల్ కుదుర్చుకున్నారు. నిందితులు ముగ్గురు కర్నూలు జిల్లాకు చెందిన వారే.

కడపలో హత్యకు ప్రణాళిక రూపొందిస్తున్న సమయంలో చాకచక్యంగా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 3.20 లక్షల రూపాయల నగదు, రెండు సెల్ ఫోన్లు, లైసెన్స్ లేని ఫిస్టల్, ఆరు తూటాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితుల్లో సంజు అనే వ్యక్తి సూడో నక్సలైట్ అని విచారణలో వెల్లడైంది.

ఇప్పటికే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఏవి సుబ్బారెడ్డి ఇంటి ముందు.. ఈ ముగ్గురు నిందితులు రెక్కీ నిర్వహించారు. ఆ సమయంలో హైదరాబాద్ పోలీసులకు భయపడి నిందితులు వెనక్కి వచ్చారు. పోలీసులకు చిక్కిన ముగ్గురిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని కడప డీఎస్పీ సూర్యనారాయణ చెప్పారు.

అయితే ఏవీ సుబ్బారెడ్డిని చంపాలని వీరితో ఒప్పందం చేసుకున్నదెవరు? వీరికి 50 లక్షలు ఇచ్చిందెవరు? అనే విషయాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు.

First Published:  22 March 2020 1:15 AM GMT
Next Story